Cooker Blast Case: కాంగ్రెస్ మాజీ మంత్రి మెడకు ఆటోరిక్షా పేలుడు కేసు.. ఆయన కార్యాలయంలో ఈడీ సోదాలు..
షిమోగా జిల్లా తీర్థహళ్లిలోని కాంగ్రెస్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసింది. అనుమానిత ఉగ్రవాది షరీఖ్ తాతయ్యకు చెందిన భవనం అది కావడం విశేషం. అనుమానిత ఉగ్రవాది షరీఖ్ డబ్బు లావాదేవీలపై ED దర్యాప్తు చేస్తోంది.

ఆటోరిక్షా పేలుడు కేసు కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది. తాజాగా ఎమ్మెల్యే ,మంత్రి కిమ్మనె రత్నాకర్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళూరు కుక్కర్ పేలుడు కేసుకు సంబంధించి బుధవారం కార్యాలయంలో మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసు నిందితుడు షరీక్ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రూ.10 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అందినసమాచారం ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో లీజు ముగుస్తుంది. అనుమానిత ఉగ్రవాది షరీక్ డబ్బు వ్యాపారానికి సంబంధించి తీర్థహళ్లిలోని షారిక్ తాతయ్యకు చెందిన భవనానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేసేందుకు ఇవాళ (జనవరి 11) అదే బ్లాక్‌లోని కాంగ్రెస్ కార్యాలయం, కిమ్మనే రత్నాకర్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది.
ఈ తెల్లవారుజామున 5 కార్లలో వచ్చిన 15 మందికి పైగా ఈడీ అధికారులు తీర్థహళ్లిలోని సొప్పుగుడ్డెలో అనుమానిత ఉగ్రవాదులు మజ్ మునీర్, షరీక్ ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని.. ఫొటోలు తీయవద్దని సూచించారు. ఈడీ అధికారులు తమ వెంట ఎస్కార్ట్ కోసం సాయుధ పోలీసులను తీసుకురావడం ఇదే తొలిసారి.
అయితే ఇదే అంశంపై రత్నాకరం ట్వీట్ చేశారు. తన ఇల్లు, కార్యాలయంపై ఎలాంటి ఈడీ దాడులు చేయలేదని అన్నారు.కేవలం తాను అద్దెకు ఉంటున్న భవనంపై మాత్రమే ఈడీ దాడి నిర్వహించిందని వెల్లడించారు. ఉదయం మా కార్యాలయానికి వచ్చిన ఈడీ అధికారులు నన్ను కార్యాలయానికి పిలిచారు. అప్పుడు నేను ఆఫీసు అద్దె గురించి తెలియజేశాను. హసీం భవనాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాను. అంతేకాకుండా నెలకు రూ. 1000 అద్దె చెల్లిస్తున్నాం. పది లక్షల రూపాయలు తిరిగిచ్చిన రోజే బిల్డింగ్ ఖాళీ చేస్తానని తెలిపాను. తీర్థహళ్లిలో జరిగిన ఈడీ దాడిపై మాజీ మంత్రి కిమ్మనె రత్నాకర్ మాట్లాడుతూ.. హసీమ్‌కు మాకు మధ్య ఓనటర్-రెంటల్ సంబంధం మాత్రమే ఉందన్నారు.
హసీంకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంటిపై ఈడీ దాడి జరిగితే నాకు రూ.పదివేలు కూడా వచ్చేది కాదు. ఇంట్లో ఉన్న సోఫా, ఫ్రిజ్‌లను తీసుకెళ్తే చాలు. హసీమ్‌కి, హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రకు సంబంధం ఏంటో నాకు తెలియదు.. మనం అతనినే అడగాలి. తీర్థహళ్లిలో మతకల్లోలాలు సృష్టించే వాడు అరగ జ్ఞానేంద్ర. అరగ జ్ఞానేంద్ర గతంలో జరిగిన మత అల్లర్లలో నిందితుడు.
ఇంకా మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. బీజేపీ పాలనలో పరువు సర్వస్వం కోల్పోయింది. ఇప్పుడు కులం, మతం విషయంలో ఏమైనా సాధిస్తారా అని చూస్తున్నారని కిమ్మనె రత్నాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




