ED Raids: గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ఆస్తులపై ఈడీ దాడులు.. భారీగా ఆస్తులు స్వాధీనం

|

Jun 07, 2022 | 4:59 PM

ED Raids In Many Cities: దేశ వ్యాప్తంగా సుమారు 19 చోట్ల ఒకేసారి త‌నిఖీలు కొనసాగుతున్నాయి. చండీఘ‌డ్‌, అంబాలా, పంచ‌కుల‌, మొహాలీ, ఢిల్లీలో ఉన్న గుప్తా బిల్డ‌ర్స్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రూ. 85 లక్షల నగదు, ఆడి క్యూ 7..

ED Raids: గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ఆస్తులపై ఈడీ దాడులు.. భారీగా ఆస్తులు స్వాధీనం
Ed Raids
Follow us on

Rs. 325 Crore Fraud Case: గుప్తా బిల్డ‌ర్స్ అండ్ ప్ర‌మోట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ED) సోదాలు నిర్వ‌హించింది. దేశ వ్యాప్తంగా సుమారు 19 చోట్ల ఒకేసారి త‌నిఖీలు కొనసాగుతున్నాయి. చండీఘ‌డ్‌, అంబాలా, పంచ‌కుల‌, మొహాలీ, ఢిల్లీలో ఉన్న గుప్తా బిల్డ‌ర్స్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రూ. 85 లక్షల నగదు, ఆడి క్యూ 7 కార్లు దీనితో పాటు అనేక చర,స్థిరాస్తి పత్రాలు(Many Documents) రికవరీ చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ, మొహాలీ, పంచకుల, చండీగఢ్, అంబాలాలోని మొత్తం 19 చోట్ల 2022 జూన్ 3 నుంచి ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడి చేసిన వారిలో గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు సతీష్ గుప్తా, ప్రదీప్ గుప్తా, వారి సహచరులు బజ్వా డెవలపర్స్ లిమిటెడ్ కుమార్ బిల్డర్స్ విన్ మెహతా ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాని డైరెక్టర్లు జర్నైల్ సింగ్ బజ్వా నవరాజ్ మిట్టల్, విశాల్ గార్గ్ ఉన్నారు.

చండీగఢ్, పంజాబ్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రైడ్

గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై చండీగఢ్, పంజాబ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు ED తెలిపింది. ఈ సందర్భంలో పై కంపెనీలు.. వాటి డైరెక్టర్లు ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్‌లు, వాణిజ్య యూనిట్లు ఇస్తానని పేరుతో డబ్బు వసూలు చేశారని అయితే ఈ డబ్బుకు బదులుగా వారికి ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. దీని ద్వారా వచ్చిన సుమారు రూ.325 కోట్ల మొత్తాన్ని కంపెనీ డైరెక్టర్లు ఇతర కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇతరుల డబ్బుతో వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం

ప్రజలు ఇచ్చిన డబ్బుతో ఈ సంస్థ, దాని వ్యక్తులు వారి వ్యక్తిగత భూములు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుల సొమ్మును వ్యక్తిగత అవసరాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రకారం.. మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు ప్రారంభించిన దర్యాప్తు కింద కంపెనీ, దాని డైరెక్టర్లు, అసోసియేట్‌ల  ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ దాడిలో రూ.85 లక్షల అప్రకటిత నగదు, ఆడి క్యూ7 కారు, పలు చర స్థిరాస్తుల పత్రాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

జాతీయ వార్తల కోసం..