National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ సమన్లు జారీ చేసింది. ED ఇప్పుడు జూన్ 23న ఆమెను ప్రశ్నించడానికి ఈ సమన్లను జారీ చేసింది. అయితే సోనియా గాంధీ కరోనావైరస్ బారిన పడిన తర్వాత ED ముందు హాజరు కావడానికి మూడు వారాల సమయం కోరింది. అంతకుముందు జూన్ 8న సోనియాను ఈడీ విచారణకు పిలిచింది. ఇదే కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లుజారీ చేసింది. జూన్ 13న రాహుల్ గాంధీని విచారణకు పిలిచిన దర్యాప్తు సంస్థ.. సమన్లు జారీ చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు.
జూన్ 1న సాయంత్రం సోనియాగాంధీకి స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా, మరుసటి రోజు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంతకు ముందు అంటే జూన్ 1న, జూన్ 8న ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ సోనియాగాంధీకి సమన్లు పంపింది. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద రాహుల్, సోనియా గాంధీల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఏజెన్సీ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2013లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ విచారణను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత పీఎంఎల్‌ఏ క్రిమినల్ నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ తాజా కేసు నమోదు చేసింది.
National herald case | ED summons Congress interim president Sonia Gandhi, asking her to join the investigation on June 23rd.
(File photo) pic.twitter.com/tLvobH3muv
— ANI (@ANI) June 10, 2022
అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బకాయిపడిన రూ.90.25 కోట్లను రికవరీ చేసేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు మోసం చేసి నిధులను దుర్వినియోగం చేసేందుకు కుట్ర పన్నారని స్వామి ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి