Abhijit Sen: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు అభిజిత్ సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. సోమవారం రాత్రి 11 గంటలకు అభిజిత్ సేన్ కు గుండెపోటు వచ్చిందని, వెంటనే ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా.. ఆసుప్రతికి వెళ్లేలోపు తుదిశ్వాస విడిచారని ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ తెలిపారు. అభిజిత్ సేన్ దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU)లో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు. కమిషన్ ఆఫ్ అగ్రకల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఛైర్మన్ తో పాటు పలు పదవుల్లో ఆయన పనిచేశారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు అభిజిత్ సేన్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా విశేష సేవలు అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆయనకు ఎంతో పట్టుంది. అభిజిత్ సేన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక రంగంలో అభిజిత్ సేన్ కృషిని ఈసందర్భంగా పలువురు కొనియాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..