AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: TMC, CPI, NCPకి ఈసీ బిగ్ షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం..

టీఎంసీ, సీపీఐ, ఎన్​సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఆమ్​ ఆద్మీ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Election Commission: TMC, CPI, NCPకి ఈసీ బిగ్ షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం..
Election Commission
Sanjay Kasula
|

Updated on: Apr 10, 2023 | 8:23 PM

Share

అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదాను దక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు చీపురుగానే కొనసాగుతుంది. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ NCP జాతీయ హోదాను కోల్పోయాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఓటమి తర్వాత ఎన్సీపీకి జాతీయ పార్టీ హోదా దక్కింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) రాష్ట్ర పార్టీ హోదాను పొందింది. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్, త్రిపురలో రాష్ట్ర స్థాయి పార్టీ హోదాను కొనసాగిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. త్రిపురలో తిప్ర మోత పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. BRS ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీలు..

  • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • భారతీయ జనతా పార్టీ
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ (ఇప్పుడు గుర్తింపు కోల్పోయింది)
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఎం
  • తృణమూల్ కాంగ్రెస్ (ఇప్పుడు గుర్తింపు రద్దు)
  • బహుజన్ సమాజ్‌ పార్టీ
  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఇప్పుడు గుర్తింపు రద్దు)
  • నేషనల్ పీపుల్స్ పార్టీ

గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి..

  • సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి.
  • చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి రావాలి.
  • ఆ పార్టీ నుంచి కనీసం నలుగురు ఎంపీలుగా గెలవాలి.
  • నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు రావాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం