జమ్మూకశ్మీర్‌లో భిన్నమైన పరిస్థితులు.. ఓ వైపు భారీగా హిమపాతం.. మరోవైపు కంపిస్తున్న భూమి..

|

Dec 28, 2024 | 11:41 AM

జమ్మూ కాశ్మీర్‌లో ఓ వైపు మంచు కురుస్తోంది. మరోవైపు భూమి కంపించింది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మంచు కురిసింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యయో. అదే సమయంలో కశ్మీర్ డివిజన్‌లోని బారాముల్లాలో రాత్రి 9.06 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది.

జమ్మూకశ్మీర్‌లో భిన్నమైన పరిస్థితులు.. ఓ వైపు భారీగా హిమపాతం.. మరోవైపు కంపిస్తున్న భూమి..
Jammu And Kashmir
Follow us on

జమ్మూకశ్మీర్‌ లోయలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గుల్‌మార్గ్‌, సోన్‌మార్గ్‌, పహల్‌గామ్‌, గురెజ్‌, జోజిలా, సాధనా టాప్‌, మొఘల్‌ రోడ్‌, బందిపోరా, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. శ్రీనగర్, గందర్బాల్, అనంత్‌నాగ్, కుల్గాం, షోపియాన్, పుల్వామా జిల్లాల్లోని మైదానాలు ఈ సీజన్‌లో మొదటి మంచు వర్షం కుర్సింది. మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్-లేహ్ హైవే , మొఘల్ రోడ్డు మూసివేవేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. కశ్మీర్ డివిజన్‌లోని బారాముల్లాలో రాత్రి 9.06 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఈ భూకంపం వలన కలిగిన నష్టం గురించి ఇంకా ఎటువంటి వార్త లేదు. మరోవైపు లోయలో భారీగా మంచు కురుస్తోండడంతో కుల్గామ్ రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. జాతీయ రహదారి-44పై మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. దోడాలో మంచు కురుస్తున్న సమయంలో చుట్టూ మంచు పొరతో తెల్ల దుప్పటి కప్పుకున్నట్లు కనువిందు చేస్తోంది.

కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది

కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శుక్రవారం లోయలో పశ్చిమ భంగం ప్రభావం కనిపించింది. దీని కారణంగా ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తోంది. పశ్చిమ భంగం కారణంగా జమ్మూ మైదానాల్లో వర్షాలు కురుస్తాయని.. చీనాబ్ లోయతో పాటు పీర్ పంజాల్ శ్రేణుల్లోని ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం కురుస్తుందని IMD తెలిపింది.

పైప్‌లైన్‌లో ఘనీభవించిన నీరు

కాశ్మీర్ అంతటా చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా పైప్‌లైన్‌లో నీరు స్తంభించిపోయింది. దాల్ సరస్సుతో సహా చాలా రిజర్వాయర్లు గడ్డకట్టడం ప్రారంభించాయి. గురువారం శ్రీనగర్‌లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకుముందు బుధవారం రాత్రి ఉష్ణోగ్రత మైనస్ ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది.

డిసెంబర్ 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు కాశ్మీర్‌లోని ఏకాంత ప్రదేశాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాటికి ఉష్ణోగ్రతలో కొంత మెరుగుదల ఉండవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం కాశ్మీర్ లోయ డిసెంబర్ 21 నుంచి ప్రారంభమైన చిల్లా-ఎ-కలన్ 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో విపరీతమైన చలి ఉంటుంది. అందులో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతుంది. చిల్లా-ఎ-కలన్ జనవరి 30న ముగుస్తుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి