Earthquake in Champhai and Afghanistan: మిజోరం రాష్ట్రంలోని చంపాయ్‌లో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి చంపాయ్‌లో ఒక్కసారిగా భూమి కంపించడంతో.. అందరూ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే కొద్ది సేపటి వరకు భూ ప్రకంపనలు సంభవించాయని స్థానికులు వెల్లడించారు. కాగా అర్ధరాత్రి 12.45 ప్రాంతంలో చంపాయ్‌లో భూమి కంపించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషన్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇదిలాఉంటే.. మంగళవారం కూడా రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
హిందూకుష్ పర్వతాల్లో కూడా..
ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని హిందూకుష్ పర్వతాల్లో కూడా భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4.01 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.9 గా నమోదయ్యిందని వెల్లడించింది. కాబూల్‌కు 277 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
Also Read: