SBI Home Loan: గృహ రుణాల వ్యాపారంలో దూసుకుపోతున్న ఎస్‌బీఐ.. రూ. 5 లక్షల కోట్ల మార్కు దాటిన బిజినెస్‌

SBI Home Loan: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది...

SBI Home Loan: గృహ రుణాల వ్యాపారంలో దూసుకుపోతున్న ఎస్‌బీఐ.. రూ. 5 లక్షల కోట్ల మార్కు దాటిన బిజినెస్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2021 | 9:51 AM

SBI Home Loan: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఈ విభాగంలో తమ వ్యాపారం రూ.5 లక్షల కోట్ల మార్కును దాటినట్లు బుధవారం బ్యాంక్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. గత ఐదేళ్లలో ఎస్‌బీఐ రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ పరిమాణం ఐదు రెట్లు వృద్ధి చెందినట్లు వెల్లడించింది. 2011లో రూ.89వేల కోట్లు ఉన్న ఏయూఎం 2021లో రూ.5 లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. తమ బ్యాంక్‌ పట్ల కస్టమర్లు అంచనాల విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారనడానికి ఈ మైలురాయే నిదర్శనమని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా సంతోషం వ్యక్తం చేశారు.

గృహ రుణాల పంపిణీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు రిటైల్‌ రుణా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో సహా ఇతర డిజిటల్‌ పద్దతులపై ఎస్బీఐ కసరత్తు చేస్తోందని అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.7 లక్షల కోట్ల గృహ రుణం ఏయూఎంను సాధించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశీయ గృహ రుణాల మార్కెట్లో ఎస్‌బీఐకి 34 శాతం వాటా ఉంది. 2004లో రూ.17వేల కోట్ల పోర్టుఫోలియోతో గృహ రుణాల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎస్‌బీఐ.. 2012లో మొత్తం రూ. లక్ష కోట్ల పోర్టుఫోలియోతో ప్రత్యేకంగా ఆర్‌ఈహెచ్‌బీయూని ఏర్పాటు చేసుకుంది.

Also Read: Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..