Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 4.56 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దాంతో జనాలు ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. భయంతో చిన్నా, పెద్దా అంతా ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రజలను ఆరా తీశారు. భూంకంప తీవ్రతను పరీక్షించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, గత కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగి పడటంతో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
ANI Tweet:
An earthquake of magnitude 3.5 on the Richter scale, occurred in Jammu and Kashmir at 4:56 am today: National Center for Seismology
— ANI (@ANI) February 7, 2021
Also read:
Mustard oil: వ్యాధులను ధరిచేరనీయని ఆవనూనే గురించి మీకు ఈ విషయాలు తెలుసా?