jammu kashmir earthquake : జమ్ముకశ్మీర్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదు..

జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో కిష్వార్ జిల్లాలో సోమవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదైంది. ..

jammu kashmir earthquake : జమ్ముకశ్మీర్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదు..

Updated on: Jan 11, 2021 | 9:49 PM

jammu kashmir earthquake : జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో కిష్వార్ జిల్లాలో సోమవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదైంది. దీనిపై సిస్మోలాజీ ఆఫ్ నేషనల్ సెంటర్ స్పందిస్తూ.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని, అలాగే కిష్త్వార్ ‌కు సమీపంలోని 33.29ఎన్‌, 75.52ఈ భూకంపానికి కేంద్రంగా ఉన్నాయని తెలిపింది. దోడా జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని అన్నారు.  వెంటనే అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో ఏమైనా నష్టం వాటిల్లితే తక్షణం తెలియజేయాలని తాహసీల్దార్లు, ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

vamshi paidipally : రామ్ చరణ్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ డైరెక్టర్.. మరోసారి ‘ఎవడు’ కాంబినేషన్.?