Earthquake In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది.   ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. 

Earthquake In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2021 | 11:36 PM

Earthquake In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది.  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి పరుగులు తీశారు. భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో – నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ అంతటా ప్రకంపనలు వచినట్టు అధికారులు తెలుపుతున్నారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కెల్ పైన 6.1గా నమోదు అయ్యింది. భూకంపం శుక్రవారం రాత్రి 10:34 గంటలకు పంజాబ్‌లోని అమృత్సర్‌ను తాకినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లో కూడా భూమి కంపించింది. రెక్టార్ స్కెల్ పై భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. జపాన్ ప్రధాన ద్వీపం హోన్షు తీరంలో శుక్రవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అంతకుముందు గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, జైపూర్‌కు వాయువ్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉదయం 11 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అదేవిధంగా ఈ రోజు రాత్రి 10:31 గంటలకు 6.3 తీవ్రతతో భూకంపం తజికిస్థాన్‌ను తాకినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఢిల్లీ లో సంభవించిన భూకంపం పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో భూకంపం సంభవించిందని, అందరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేసారు.