Uttarakhand floods: ఉత్తరఖండ్ జలప్రళయంపై కారణాలను అన్వేషిస్తోన్న శాస్ర్తవేత్తలు.. శాటిలైట్ దృశ్యాల ఆధారంగా..

Scientists Research What May Have Caused Uttarakhand Flash Floods: ఉత్తరఖాండ్‌లో సంభవించిన ఆకస్మిక జలప్రళయం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా వచ్చిన వరదల కారణంగా వందల సంఖ్యలో...

Uttarakhand floods: ఉత్తరఖండ్ జలప్రళయంపై కారణాలను అన్వేషిస్తోన్న శాస్ర్తవేత్తలు.. శాటిలైట్ దృశ్యాల ఆధారంగా..
Follow us

|

Updated on: Feb 12, 2021 | 9:17 PM

Scientists Research What May Have Caused Uttarakhand Flash Floods: ఉత్తరఖండ్‌లో సంభవించిన ఆకస్మిక జలప్రళయం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా వచ్చిన వరదల కారణంగా వందల సంఖ్యలో జనాలు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే అసలు ఈ విపత్తు జరగడానికి కారణాలేంటన్న దానిపై శాస్ర్తవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ ప్రశాంత్ వంగ్ల నేతృత్వంలోని బృందం నందా దేవి గ్లేసియర్ ప్రాంతాన్ని సందర్శించి కీలక వివరాలు సేకరించారు. నదిలో 550 మీటర్ల వెడల్పు, 2 కి.మీ ఎత్తున భారీ హిమశిఖరం విరిగిపడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇదిలా ఉంటే గతంలో 2016లో కొండ చరియలు విరిగిపడినప్పుడు గ్లేసియర్ మంచు భారీగా పేరుకోగా, ఈ భారీ హిమశిఖరం దానిపై పడడంతో ఇంతటీ భారీ విపత్తు చోటుచేసుకుందని శాస్ర్తవేత్తుల ఓ అంచనాకు వచ్చారు. ప్రమాదానికి సంబంధించి కీలక ఆదారాలను సేకరించే క్రమంలో ఫ్రెండ్ శాటిలైట్ దృశ్యాలు, డ్రోన్ వీడియోలు విశ్లేషిస్తోన్న బృందం నివేదికను రూపొందిస్తోంది. విపత్తు జరిగిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన, అధునాతన అధ్యయనం అంశాలపై విదేశీ యూనివర్సిటీలతో కలిసి ఐఐటీ బృందం పరిశోధనలు చేయనుంది. ఈ బృందానికి అధికారులుగా ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ ప్రశాంత్, ప్రొఫెసర్ డేవిడ్ ఫ్రాస్ట్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు శాటిలైట్‌ చిత్రాల్లో తేలింది. ప్రస్తుతం ఆ సరస్సులో నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత పెరగడం వల్లే ఈ సరస్సు ఏర్పడినట్లు శాస్ర్తవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.

Also Read: CoronaVirus: ఆస్ట్రేలియ‌న్‌ బీఫ్ నుంచి మహమ్మారి క‌రోనా.. చైనా వాదనను సమర్థించిన డ‌బ్ల్యూహెచ్‌వో