PM Modi Gifts: ప్రధాని మోదీ బహుమతుల ఈ-వేలం.. ఆక్షన్‌లో 1200 వస్తువులు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయనకు వచ్చిన..

PM Modi Gifts: ప్రధాని మోదీ బహుమతుల ఈ-వేలం.. ఆక్షన్‌లో 1200 వస్తువులు..
Pm Modi Gifts
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 17, 2022 | 4:37 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయనకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల నాలుగో ఎడిషన్ ఈ-వేలాన్ని ప్రారంభించింది. 16 రోజుల పాటు కొనసాగనున్న ఈ-వేలం అక్టోబర్ 2న ముగుస్తుంది.

బహుమతుల ప్రదర్శనను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA)లో నిర్వహిస్తుండగా.. వాటిని అందరూ ఉచితంగా చూడవచ్చునని ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ-వేలం ద్వారా సేకరించిన నిధులను గంగను పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి దోహదం చేస్తున్న ‘నమామి గంగే’ ప్రాజెక్ట్‌కు వినియోగించనున్నారు.

సుమారు 1200 మెమెంటోలు, బహుమతి వస్తువులను ఈ వేలంలో ఉంచారు. అయోధ్య రామమందిరం, వారణాసిలోని కాశీ-విశ్వనాధ దేవాలయ నమూనాలు, ఆసక్తిని కలిగించే ఇతర బహుమతులు ఈ నాలుగో ఎడిషన్ ఈ-వేలంలో ఉన్నాయి. కాగా, మొదటి ఈ-వేలం 2019లో నిర్వహించగా.. అప్పుడు సుమారు 1,805 బహుమతులను బిడ్డింగ్‌లో ఉంచారు. అటు రెండో ఎడిషన్‌లో 2,772 బహుమతి వస్తువులను వేలంలో ఉంచారు. సెప్టెంబర్ 2021లో జరిగిన మూడవ ఎడిషన్ వేలంలో 1,348 వస్తువులు ఉంచిన విషయం తెలిసిందే.