
దేశంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఢిల్లీ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ రహదారులకు విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.6,970 కోట్లతో ఢిల్లీలో 6 లేన్‌లతో ద్వారకా సొరంగం నిర్మించాలని ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ఇందుకూ గానూ రూ.7,145 కోట్లతో కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దేశంలో రవాణా వ్యవస్థ మరింత బోలోపేతం అవుతుందని.. ఇది దేశ ప్రగతికి కూడా దోహదపడుతుందని మంత్రివర్గం పేర్కొంది.
#WATCH | Delhi: At the Union cabinet briefing, Union Minister Ashwini Vaishnaw says, "The first project is the 2-lane Dwarka tunnel. This will prove to be a huge boon for Delhi. This 8-kms tunnel addresses a long-standing demand… As per the detailed map: starting from the Shiv… pic.twitter.com/CWtmuQ8flY
— ANI (@ANI) July 1, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.