Dussehra 2024: దసరా సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలివే..

|

Oct 12, 2024 | 1:20 PM

TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ప్రేక్షకులలో ఆనందం, ఉత్సాయాన్ని నింపుతున్నాయి .  అందుకనే ఈ ఉత్సవాలకు యువత నుంచి వృద్ధుల వరకు, మహిళలు కూడా రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల్లో యువకులు, పెద్దల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు టీవీ9 నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు నాలుగో రోజు. రేపటితో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా జనం తరలివచ్చారు.

Dussehra 2024: దసరా సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలివే..
Tv9 Festival Of India 2
Follow us on

దేశ వ్యాప్తంగా దసరా పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను TV9 నెట్‌వర్క్ కూడా ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరుతో  దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నారు. ఈ ఉత్సవాలు ఢిల్లీ వాసులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దుర్గాపూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ పండుగకు జనం పోటెత్తారు. ఈ రోజు ఉత్సవాలు  నాలుగో రోజు.. ఈ రోజు దసరా కూడా.. ఈ ఉత్సవాల్లోని కార్యక్రమాలు ఢిల్లీ వాసులకు ఆనందమే కాదు, ఉల్లాసాన్ని కూడా కలిగిస్తున్నాయి.

TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ప్రేక్షకులలో ఆనందం, ఉత్సాయాన్ని నింపుతున్నాయి .  అందుకనే ఈ ఉత్సవాలకు యువత నుంచి వృద్ధుల వరకు, మహిళలు కూడా రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల్లో యువకులు, పెద్దల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు టీవీ9 నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు నాలుగో రోజు. రేపటితో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా జనం తరలివచ్చారు.

Tv9 Festival Of India 3

ఈ రోజు ఏమి ఉండనున్నాయంటే

గత మూడు రోజులుగా ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు విపరీతమైన జనం వస్తున్నారు. నేటి నాలుగో రోజు కూడా చాలా ప్రత్యేకం. దసరా పండుగ చివరి రోజు.  కనుక  ఈరోజు చాలా ముఖ్యమైనది. అక్టోబర్ 12న అంటే ఈరోజు దసరా నవమి పూజతో కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఉదయం 8.30 గంటలకు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీవీ 9 నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ బరున్ దాస్ సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించారు .

ఇవి కూడా చదవండి

 

TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

ఉదయం 11 గంటలకు హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు చండీ పారాయణం జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈరోజు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు సంధ్యా హారతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

Tv9 Festival Of India

పిల్లల కోసం ప్రత్యేక ప్రణాళిక

ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో నాల్గవ రోజు పిల్లల కోసం మాత్రమే. నేడు పిల్లల కోసం రకరకాల కార్యకలాపాలు ఉన్నాయి. డ్రాయింగ్ నుంచి డ్యాన్స్ , ఫ్యాన్సీ డ్రెస్ వరకు అనేక విభిన్న ఆటలు  ఈరోజు నిర్వహించనున్నారు. అంతే కాదు ఈ ప్రదేశంలో ఆనంద్ మేళా కూడా నిర్వహించనున్నారు. ఈ ఆనంద మేళాలో భారతదేశ సంస్కృతి కనిపించే విధంగా నిర్వహించనున్నారు .

ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి వచ్చే సమయంలో ప్రత్యేక ఆహారాన్ని తీసుకురావాలని చెప్పారు. మీ అమ్మమ్మ, నానమ్మలు చేసే ప్రత్యేక వంటకాలను కూడా తీసుకురావచ్చు. లేదా తల్లి చేతితో తయారు చేసిన ఆహారం లేదా మీరు సొంతంగా తయారు చేసిన ఆహారాన్ని అయినా తీసుకుని రావచ్చు అంటూ ఆహ్వానించారు. మొత్తంమీద ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఈ రోజు చిన్నపిల్ల సందడి చేయనున్నారు.

ఫుడ్ అండ్ డ్రింక్  ట్రైన్

ఈ పండుగలో ఫుడ్ అండ్ డ్రింక్  ట్రైన్ కూడా ఉంది. ఈ స్థలంలో అనేక ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పంజాబీ ఆహారం నుండి, బీహార్ లిట్టి చోఖే, లక్నో  కబాబ్‌లు, మహారాష్ట్ర పావ్ భాజీ, రాజస్థాన్ వంటకాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి మాత్రమే కాదు ఈ ఫుడ్ స్టాల్స్ లో ఢిల్లీ పానీపూరీ, చాట్ తో పాటు  చైనీస్ వంటకాలను కూడా ఏర్పాటు చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .