Boat Sinking River: ఏపీలో గత వారం రోజులుగా బీభత్సం సృష్టిస్తున్న జవాద్ తుపాను ఎట్టకేలకు రూట్ మార్చింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలోని కోస్తా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలిన జవాద్ అక్కడి తీర ప్రాంతవాసుల్ని బెంబేలెత్తిస్తోంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలో తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్ సుందర్‌బన్ నదిలో బోటు బోల్తా పడింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందితో వెళ్తున్న బోటు.. ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బోటులో 10 సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
నజత్ పోలీస్ స్టేషన్‌లోని బసిర్‌హత్ సబ్ డివిజన్‌లో గల బెటాని నదిలో కాళీనగర్ ఘాట్ వైపు ఇనుప రాడ్‌లు, అదనపు వస్తువులతో పడవ వెళుతోంది. ఆ సమయంలో నదిలో ఎక్కువ నీరు రావడంతో బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న 10మంది వ్యక్తులు నదిలో పడిపోయారు. ఆ పక్క నుంచే మరో బోటు కూడా వెళ్లింది. ఎదురుగా ఉన్న బోటు పల్టీ కొట్టడాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also read:
Omicron Variant-Third Wave: భారత్ లో ఒమిక్రాన్ విలయతాండవం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..(వీడియో)