Joint Operation: ఫ్యాక్టరీలో గుట్టుగా యవ్వారం.. ఖాకీల మెరుపుదాడిలో రూ.1800 కోట్ల సరుకు సీజ్..!

|

Oct 06, 2024 | 4:12 PM

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్లకుపైగా విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు..

Joint Operation: ఫ్యాక్టరీలో గుట్టుగా యవ్వారం.. ఖాకీల మెరుపుదాడిలో రూ.1800 కోట్ల సరుకు సీజ్..!
MD Drugs Seized in Bhopal
Follow us on

భోపాల్, అక్టోబర్ 6: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో రూ.1800 కోట్లకుపైగా విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ ల్యాబ్‌లో సింథటిక్ ఎండీ డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు. ఇవి మెథాంఫేటమిన్ వంటి ఉద్దీపనల మాదిరిగానే అధిక ప్రభావం కలిగి ఉంటాయి.

దీంతో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్), ఢిల్లీకి చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించాయి. భోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి ఎండీ, ఎండీ తయారీకి వినియోగించే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఎండీ డ్రగ్‌ విలువ దాదాపు రూ.1,814 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు మంత్రి హర్ష సంఘవి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘ఏటీఎస్‌, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో అధికారుల అవిశ్రాంత పోరాటం విజయవంతమైంది. ఆరోగ్యకరమైన సమాజం, భద్రతను కాపాడటంలో నిర్విరామంగా శ్రమిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.