Viral Video: ఎంతకు తెగించార్రా..! అందరూ చూస్తుండగానే యువకుడి ఘాతుకం.. షాకింగ్ వీడియో వైరల్!
రైల్వేలు దేశ ప్రజల ఆస్తి. అయితే ఇటీవలి కాలంలో రైల్వేపై దాడులు చేయడం, పట్టాలు ధ్వంసం చేయడం వంటి అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
రైల్వేలు దేశ ప్రజల ఆస్తి. అయితే ఇటీవలి కాలంలో రైల్వేపై దాడులు చేయడం, పట్టాలు ధ్వంసం చేయడం వంటి అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇలాంటి చర్యలు చూసి, ఇలాంటి వార్తలు వింటే కచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది. అటువంటి పరిస్థితిలో, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి వెదురు కర్రతో స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఏసీ కోచ్ అద్దాలను పగలగొట్టడం కనిపిస్తుంది. బీహార్‌లో జరిగిన ఈ ఘటనను చూసిన జనాలు ఘాటుగా స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న పాట్నా-న్యూఢిల్లీ రైలును ఒక వ్యక్తి కోపం రైలు ఏసీ కోచ్ అద్దాలను ధ్వంసం చేశాడు. కసిదీరా వెదురు కర్రతో పగులగొట్టాడు. ఈ వైరల్ వీడియో ఘటన పాట్నా జంక్షన్‌లో జరిగింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న రైలులోని ఏసీ కోచ్‌పై వెదురుతో దారుణంగా దాడి చేసి, అద్దాలు పగలగొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్లాట్‌ఫారమ్ నుంచి జనం వెళ్లిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణిస్తున్న రైలుపై దాడి ఘటనను ప్రజలు చూస్తున్నారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
దీనికి ముందు కూడా, ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అందులో అతను వందే భారత్ రైలు కిటికీ అద్దాలపై సుత్తితో దాడి చేయడం కనిపించింది. ఆ వ్యక్తిని సుత్తితో కొట్టడం చూసి.. ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న వందేభారత్ రైలు అద్దాన్ని సుత్తితో పగలగొట్టిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడం గమనార్హం. అయితే అతడిని అడ్డుకునే వారు ఎవరూ లేరు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..