Kerala: కేరళ తీరంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. పాకిస్థాన్ వాసి అరెస్టు

|

May 14, 2023 | 8:24 AM

కేరళ తీర ప్రాంతంలోని భారీగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న గుట్టు రట్టైంది. దాదాపు 12 వేల కోట్ల విలువైన 2500 కిలోల మెథాంఫెటమిన్‌ను అధికారులు ఓడ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నావీ , నార్కోస్టిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ ఆపరేషన్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అక్రమ రవాణాకి సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Kerala: కేరళ తీరంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. పాకిస్థాన్ వాసి అరెస్టు
Drugs
Follow us on

కేరళ తీర ప్రాంతంలోని భారీగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న గుట్టు రట్టైంది. దాదాపు 12 వేల కోట్ల విలువైన 2500 కిలోల మెథాంఫెటమిన్‌ను అధికారులు ఓడలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. నావీ , నార్కోస్టిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ ఆపరేషన్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అక్రమ రవాణాకి సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో భారీ స్థాయిలో మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్ఘానిస్థాన్ నుంచి సముద్రమార్గంలో తరలించే డ్రగ్స్‌ని ఛేదించేందుకు ‘ఆపరేషన్ సముద్రగుప్త్’ ‌లో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డెరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇది గత ఏడాదిన్నర కాలంలో దక్షిణాది మార్గంలో సముద్రాల గుండా అక్రమంగా రవాణా చేస్తున్న డ్రగ్స్‌ని పట్టుకోవడం ఇది మూడోసారి. ఇప్పటివరకు 3,20 కిలోల మెథాంఫెటమిన్, 500 కేజీల హెరాయిన్, 529 కేజీల హాషిష్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఇప్పుడ తాజాగా పట్టుబడిన మెథాంఫెటమిన్ అఫ్ఘానిస్థాన్ నుంచి ఇండియా, శ్రీలంక, మాల్దీవ్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.