Drugs Busted: ఎన్నికల వేళ భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.230 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్‌ స్వాధీనం

|

Apr 28, 2024 | 10:05 AM

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) పెద్ద డ్రగ్ ముఠాకు చెక్ పెట్టారు. ఏటీఎస్‌, ఎన్‌సీబీ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌లలో రూ.230 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్‌తో 13 మందిని అరెస్టు చేశారు.

Drugs Busted: ఎన్నికల వేళ భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.230 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్‌ స్వాధీనం
Drugs
Follow us on

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) పెద్ద డ్రగ్ ముఠాకు చెక్ పెట్టారు. ఏటీఎస్‌, ఎన్‌సీబీ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌లలో రూ.230 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్‌తో 13 మందిని అరెస్టు చేశారు. ఈ బ్లాక్ డ్రగ్ గేమ్ గురించి గుజరాత్ ATSకి రహస్య సమాచారం అందింది. దీంతో ఏకకాలంలో దాడి చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్ ఏటీఎస్, ఎన్‌సీబీ శుక్రవారం దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన మనోహర్ లాల్ ఎనాని, రాజస్థాన్ రాష్ట్రానికి చెకందిన కుల్దీప్ సింగ్ రాజ్‌పురోహిత్ డ్రగ్స్ బ్లాక్ దందా నడుపుతున్నట్లు ATS సమాచారం అందింది. నిందితులిద్దరూ మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారని, అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారవుతున్నాయని గుజరాత్ ఏటీఎస్‌కు తెలిపారు.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఎటిఎస్ 22.028 కిలోల మెఫెడ్రోన్ మరియు 124 కిలోల లిక్విడ్ మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. దీని మార్కెట్ విలువ రూ. 230 కోట్లు ఉంటుదన్నారు. గాంధీనగర్‌లో జరిగిన దాడిలో రాజ్‌పురోహిత్ పట్టుబడ్డాడు. సిరోహి నుండి అనానిని అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని సిరోహి, జోధ్‌పూర్‌లో ఉన్న తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అంతేకాకుండా, గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని పిప్లాజ్ గ్రామం, అమ్రేలి జిల్లాలోని భక్తినగర్ పారిశ్రామిక ప్రాంతంలో దాడులు చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్‌లోని ఒక పారిశ్రామిక యూనిట్‌లో మెఫెడ్రోన్ ఉత్పత్తిలో పాల్గొన్నందుకు అనానిని 2015లో DRI అరెస్టు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఏడేళ్లపాటు జైల్లో ఉన్నాడు. నిందితులందరూ ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారని, వల్సాద్ జిల్లాలోని వాపి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీ నుంచి డ్రగ్స్ తయారీకి ముడిసరుకు తెస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరు ఎంతకాలంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఇంతకు ముందు ఎవరికైనా డ్రగ్స్‌ను విక్రయించారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ మొత్తం బ్లాక్ డ్రగ్స్ వ్యాపారంలో ఎవరెవరు ప్రమేయం ఉన్నారనే దానిపై కూడా విచారణ జరుగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…