తల్లిని కొడుతుండగా అడ్డొచ్చిన తండ్రి.. కొడుకు ఏం చేశాడో తెలిస్తే..

దేశంలో రోజురోజుకూ యువత మత్తుకు బానిసైపోతున్నారు. డ్రగ్స్‌, గంజాయి, సిగరెట్‌ వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలానే మత్తుకు బానిసైన ఒక యువకుడు మత్తులో ఏకంగా తన తండ్రినే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

తల్లిని కొడుతుండగా అడ్డొచ్చిన తండ్రి.. కొడుకు ఏం చేశాడో తెలిస్తే..
Crime News

Edited By: TV9 Telugu

Updated on: Sep 04, 2025 | 10:16 AM

దేశంలో రోజురోజుకూ యువత మత్తుకు బానిసైపోతున్నారు. డ్రగ్స్‌, గంజాయి, సిగరెట్‌ వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలానే మత్తుకు బానిసైన ఒక యువకుడు మత్తులో ఏకంగా తన తండ్రినే హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయ్ జిల్లా డీచ్‌చోర్ అంత్వా గ్రామానికి చెందిన అంకిత్‌ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే అంకిత్‌ గత కొన్ని రోజులుగా మత్తుపదార్థాలుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లతో గొడవపడేవాడు.ఈ అలవాట్లు మానుకోవాలని చెప్పిన తల్లిని అంకిత్‌ కొడుతుండేవాడని గ్రామస్థులు తెలిపారు. అయితే ఇటీవల అంకిత్ తల్లిని కొడుతుండడం చూసి తండ్రి సర్వధర్ అతన్ని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది..

ఇక మత్తులో ఉన్న అంకిత్ తండ్రిపై దాడి చేయడంతో తీవ్రగాయాలై తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రి మృతదేమాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.