Big accident: బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో 9 మంది మృతి

|

Dec 31, 2022 | 11:19 AM

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. హడావుడిగా క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు.. క్రేన్ల సాయంతో రెండు వాహనాలను రోడ్డు పక్కనే ఉంచి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది.

Big accident: బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో 9 మంది మృతి
Gujarat Accident
Follow us on

గుజరాత్‌లోని నవ్‌సారిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బస్సు నేరుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. 48వ నెంబరు జాతీయ రహదారిపై వెస్మా గ్రామ సమీపంలో జరిగింది ఈ ఘటన. కదులుతున్న వాహనంలోనే బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. దాంతో వాహనంపై అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన వారిని, మృతదేహాలను బయటకు తీయడానికి రెండు వాహనాలను కట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో క్షతగాత్రులకు సాయం అందడంలో కాస్త జాప్యం జరిగినట్టుగా చెప్పారు.

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. హడావుడిగా క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు.. క్రేన్ల సాయంతో రెండు వాహనాలను రోడ్డు పక్కనే ఉంచి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్‌కు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, శనివారం ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వాహనాన్ని అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నవ్‌సారి జిల్లా పోలీసు చీఫ్‌తో సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి