Dipcovan: డీఆర్‌డీఓ నుంచి మరో అస్త్రం.. కోవిడ్ యాంటిబాడీ డిటెక్షన్ కిట్ ‘డిప్కోవాన్’ అభివృద్ధి
DRDO develops DIPCOVAN: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మరో మందడుగు వేసింది. కరోనాపై పోరులో భాగంగా.. డీఆఆర్‌డీఓ ఇటీవల 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని
DRDO develops DIPCOVAN: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మరో మందడుగు వేసింది. కరోనాపై పోరులో భాగంగా.. డీఆఆర్‌డీఓ ఇటీవల 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని తయారుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్ -19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను సైతం అభివృద్ధి చేసింది. డీఆర్డీఓ డిప్కోవాన్ పేరిట ఈ కరోనా టెస్టింగ్ కిట్‌ను రూపొందించింది. డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్ (డిపాస్), ఢిల్లీకి చెందిన వాన్ గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కొత్త కిట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. ఈ డిప్కోవన్ కిట్ ద్వారా శరీరంలో యాంటీబాడీలను సులభంగా గుర్తించవచ్చు. డిప్కోవన్ కిట్ 97% సున్నితత్వంతో కొరోనావైరస్ నిర్ధారణ, న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్లను గుర్తించగలదని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ కిట్‌కు 18 నెలల నిర్ణిత గడువు ఉంటుందని.. ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో పరిశోధనలు చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది.
కాగా.. డిప్కోవాన్ కోవిడ్ టెస్టింగ్ కిట్ ధర కేవలం 75 రూపాయలే. ఇది జూన్ మొదటివారంలో మార్కెట్లోకి రానుంది. ఓ వ్యక్తి గతంలో కరోనా బారినపడ్డాడా? లేదా..? అనే విషయం ఈ కిట్‌తో వెల్లడవుతుంది. కేవలం 75 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం తెలిసిపోతుందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. డిప్కోవాన్ కిట్‌కు ఏప్రిల్‌లోనే ఐసీఎంఆర్ ఆమోదం లభించింది. మే నెలలో డీసీజీఐ, సీడీఎస్ సీఓ, కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించారు. కాగా.. జూన్‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.
Also Read: