ఓ మాజీ పోలీసు అధికారిని బలవంతంగా వ్యాన్ లో ‘కుక్కేసిన’ పోలీసులు..ఎక్కడంటే .?

యూపీలో మాజీ పోలీసు అధికారి అమితాబ్ ఠాకూర్ ని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో 'కుక్కేసిన' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని, అంతవరకు తాను పోలీసు స్టేషన్ కు...

ఓ మాజీ పోలీసు అధికారిని బలవంతంగా వ్యాన్ లో 'కుక్కేసిన' పోలీసులు..ఎక్కడంటే .?
Dramatic Arrest Of Up Ex Cop Who Challenged Yogi Adityanath
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 28, 2021 | 1:54 PM

యూపీలో మాజీ పోలీసు అధికారి అమితాబ్ ఠాకూర్ ని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో ‘కుక్కేసిన’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని, అంతవరకు తాను పోలీసు స్టేషన్ కు రాబోనని మొరాయిస్తున్న ఆయనను వారు బలవంతంగా వ్యాన్ లో ‘కుక్కారు’. లక్నోలోని తన నివాసం వద్దే అందరూ చూస్తుండగా ఈ హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన అనేక మంది ఖాకీల ‘అమానుషాన్ని’ దుయ్యబట్టారు. ఒక మాజీ పోలీసు అధికారిని ఇంత క్రూరంగా అరెస్టు చేస్తారా అని వారు దుయ్యబట్టారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదంటూ హోమ్ శాఖ ఈయనను గత మార్చిలో బలవంతంగా తొలగించింది. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం యోగి ఆదిత్య నాథ్ పైనే పోటీ చేస్తానని అమితాబ్ ఠాకూర్ లోగడ ప్రకటించాడు.అయితే ఈయన వ్యవహారంలో ఓ క్రైమ్ కోణం కూడా ఉంది. ఓ యువతిని, ఆమె స్నేహితుడిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణకూడా ఇతనిపై ఉంది. ఈ నెల 19 న ఢిల్లీలో సుప్రీంకోర్టు బయట ఈ యువతీ యువకులు తమ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. వారిని పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మొదట ఆ యువకుడు.. ఆ తరువాత రెండు మూడు రోజులకే ఆ యువతి మరణించింది.

2019 లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ అతుల్ రాయ్ తనను రేప్ చేశాడని..ఆ తరువాత ఈ కేసులో తనను తీవ్రంగా వేధించిన ఆయన సహచరులు, కొంతమంది పోలీసు అధికారుల్లో ఈ అమితాబ్ ఠాకూర్ కూడా ఉన్నాడని ఆ యువతి తన మరణ వాంగ్మూలంలో తెలిపింది. దాంతో సూసైడ్ కి ప్రేరేపించాడన్న అభియోగాన్ని పోలీసులు ఇతనిపై మోపారు. ఇక ‘అధికార్ సేన’ అనే కొత్త పార్టీని పెడుతున్నానని, ఈ పార్టీ తరఫున తాను సీఎం యోగిపై పోటీ చేస్తానని అమితాబ్ ఠాకూర్ ఈ మధ్యే చెప్పాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఒళ్లుగగ్గుర్లు పొడిచే వీడియో ఇది..! మరిన్ని వైరల్ వార్తలపై స్పెషల్ వీడియో :Special All Viral Videos.

రెండు జంతు జాతుల స్నేహబంధం.. హిప్పోపై తాబేళ్లు ఫ్రీ రైడ్.. వీడియో వైరల్:Turtles on Hippo Back Video.

భార్య అంటే మరి ఇంత ప్రేమా..! భార్య చితిలోకి దూకి.. పతి సహగమనం చేసిన భర్త..:Viral Video.

విధి ఆడిన వింత నాటకం.. పిజ్జా బాయ్ గా మారిన మాజీ ఐటీ మంత్రి.. ఒకప్పుడు ఐటీ మంత్రి..:Former Minister as Pizza Boy Viral video.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?