AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే కన్నీళ్లే..

కాబోయే కోడలు ఆ కుటుంబంలో నవ్వులు తెస్తుందనుకుంటే అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఒక్క దారుణంతో ఆ కుటుంబంలో విరిసిన నవ్వులన్నింటినీ చిదిమేసింది. కాబోయే భార్య చేతిలో మరణించిన కేతన్ అగర్వాల్ కేసులో మరో గుండె పగిలే విషాదం చోటుచేసుకుంది. మనవడి మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ శనివారం రాత్రి కన్నుమూశారు.

మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే కన్నీళ్లే..
Ketan Agarwal's Grandfather Passed Away
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 10:57 AM

Share

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసు ఆ కుటుంబంలో తీరని ఆవేదనను మిగిల్చింది. కాబోయే భార్య చేసిన ఘోరానికి బలైన కేతన్ మరణాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనతో అతని తాత దేవీచంద్ అగర్వాల్ శనివారం సాయంత్రం పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒకే నెలలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో అగర్వాల్ కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి లోయలోకి నెట్టేసి కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణం జరిగిన రోజు నుంచే తాత దేవీచంద్ తీవ్రమైన మానసిక షాక్‌లోకి వెళ్లిపోయారు. కళ్లముందే ఎదిగిన మనవడి జ్ఞాపకాలతోనే రోజులు గడిపిన ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

క్యాండిల్ ర్యాలీలో కన్నీటి పర్యంతం

జూన్ 27న కేతన్‌కు న్యాయం చేయాలని కోరుతూ పూణేలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా దేవీచంద్ పాల్గొన్నారు. ‘‘ఎన్నేళ్లుగానో నమ్మిన వారే మా వెన్నుపోటు పొడిచారు. నా మనవడి ప్రాణాలు తీశారు. మాకు న్యాయం జరగాలి’’ అంటూ ఆనాడు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని చనిపోయే వరకు ఆయన తపించారు.

నిందితులకు 14 రోజుల రిమాండ్

ఈ కేసు దర్యాప్తును పూణే పోలీసులు ముమ్మరంగా జరుపుతున్నారు. ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను వాద్గావ్ మావల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పొడిగించాలన్న పోలీసుల డిమాండ్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఇద్దరు నిందితులకు 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ జైల్లోనే ఉండగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?