వ్యాక్సిన్ వృధా చేస్తే తీవ్ర చర్యలు… రాజస్తాన్ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక…. ఇతర రాష్ట్రాలకూ పరోక్ష సూచన

| Edited By: Phani CH

Jun 01, 2021 | 11:07 AM

వ్యాక్సిన్ ను వృధా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో టీకామందుల వృధా జరుగుతోందని వచ్చిన వార్తలను సీరియస్ గా పరిగణిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ అన్నారు.

వ్యాక్సిన్ వృధా చేస్తే తీవ్ర చర్యలు... రాజస్తాన్ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక.... ఇతర రాష్ట్రాలకూ పరోక్ష సూచన
Covid Vaccination
Follow us on

వ్యాక్సిన్ ను వృధా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో టీకామందుల వృధా జరుగుతోందని వచ్చిన వార్తలను సీరియస్ గా పరిగణిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మకు లేఖ రాస్తూ ఓ వైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండగా మరో వైపు మీ రాష్ట్రంలో ఇది వృధా అవుతోందని సమాచారం అందిందని పేర్కొన్నారు. రాజస్థాన్ లోని 35 కోవిద్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 500 వైల్స్ కి పైగా టీకామందులను డస్ట్ బిన్ లో పారవేసినట్టు తమకు తెలిసిందన్నారు. దీన్ని సహించబోమని..ఈ నిర్లక్ష్యంపై దర్యాప్తు జరపాలని కోరుతున్నామని హర్షవర్ధన్ అన్నారు. మీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వ్యాక్సిన్ వృధా అవుతున్నట్టు తెలిసిందని, వెంటనే దీనిపై దృష్టి పెట్టి దీన్ని అరికట్టాలని అధికారులను ఆదేశించాలన్నారు. 500 కి పైగా వైల్స్ వేస్ట్ అయ్యాయంటే మీరు కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. వ్యాక్సిన్ వృదా కాకుండా చూసేందుకు తగిన ప్లానింగ్ ఉండాలని, అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలని హర్షవర్ధన్ సూచించారు. ఇంకా ఇలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన ఉదంతాలు జరిగితే ఎప్పటికప్పుడు తమకు తెలుస్తుందని, అందువల్ల ఆయా రాష్ట్రాలు కూడా జాగ్రత్త పడతాయని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

లోగడ దేశంలో ఇలా నిర్లక్ష్యం వహించిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ ‘వరుస’ లో ఉన్నట్టు సమాచార హక్కు చట్టం కింద ఓ యాక్టివిస్ట్ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా తెలిసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కుటుంబంలో తీర‌ని విషాదం.. ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న ఆ త‌ల్లి రోద‌న

Solar Eclipse 2021: జూన్‌ 10న ఆకాశంలో మరో అద్భుతం.. ఈసారి సంభవించే సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే..?