డ్యూటీలో ఉండగా మొబైల్ ఫోన్ వాడారంటే అంతే సంగతులు ! పోలీసులకు బీహార్ డీజీపీ ఆదేశాలు ..అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్

ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు గానీ, వీఐపీ లేదా వీవీఐపీల బందోబస్తు డ్యూటీలో ఉన్నప్పుడు గానీ పోలీసులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడరాదని బీహార్ డీజీపీ ఆదేశించారు.

డ్యూటీలో ఉండగా మొబైల్ ఫోన్ వాడారంటే అంతే సంగతులు ! పోలీసులకు బీహార్ డీజీపీ ఆదేశాలు ..అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్
Don't Use Mobiles While On Duty Says Bihar Dgp. Bihar

Edited By:

Updated on: Jun 02, 2021 | 4:59 PM

ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు గానీ, వీఐపీ లేదా వీవీఐపీల బందోబస్తు డ్యూటీలో ఉన్నప్పుడు గానీ పోలీసులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడరాదని బీహార్ డీజీపీ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులందరికీ లేఖలు రాశారు. ఈ ఉత్తర్వులను ధిక్కరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఉండగా అనేకమంది ఖాకీలు తమ మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ గానీ, వాటి ద్వారా సందేశాలు పంపుతూ గానీ కనబడుతున్నారంటూ అనేక ఫిర్యాదులు డీజీపీ కార్యాలయానికి వెళ్లాయి. దీంతో డీజీపీ ఎస్.కె. సింఘాల్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొందరు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ట్రాఫిక్ రద్దీగా ఉన్నప్పుడు తమ ఫోన్లలో మాట్లాడుతూ కనిపిస్తున్నారని చాలామంది ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ..చూడబోతే ఇది వారి ‘ప్రధాన డ్యూటీలా ‘ఉందని సెటైర్ వేశారు. విధి నిర్వహణలో ఉండగా మహిళా పోలీసులు గానీ, పురుష ఖాకీలు గానీ ఎంతో అప్రమత్తంగా ఉండాలని. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేలా చూడాలని ఆయన అన్నారు. అలాగే ప్రజలు ఎప్పుడు కోరినా వారికీ సాయపడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకవేళ అలా కాని పక్షంలో డ్యూటీ పట్ల వారి నిర్లక్ష్యం వహిస్తున్నారని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

2019 లో రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ విధమైన చర్యలు చేపట్టింది. పోలీసులు తమ మొబైల్ ఫోన్లను సీనియర్ అధికారులవద్ద ఉంచాలని ఆదేశించింది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : కరోనా సోకడం మంచిదే అంటున్న శాస్త్రవేత్తలు..!షాకింగ్ విషయాలు వెల్లడి :Corona Second Wave

చిన్నారి చిరు సాయానికి మెగాస్టార్ ఫిదా..పుట్టినరోజుకు దాచుకున్న మనీ అంత డొనేట్ చేసిన చిన్నారి.: Chiranjeevi Fida for child’s help video

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత..ప్రేమ పెళ్లి అంట.ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో తెలుసా..?:Pranitha’s secret marriage Video.

 బ్రేక్ లు ఫెయిల్ అయ్యిన లారీ ని ఎంతో నైపుణ్యంగా 3 కి.మీ రివర్స్ లో డ్రైవింగ్.. వైరల్ అవుతున్న వీడియో,ఫిదా అవుతున్న నెటిజెన్లు : Viral Video