పెళ్లి పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలతో నమ్మించి.. ఆ వైద్యుడు ఏం చేశాడంటే

సమాజంలో మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అతను తన ప్రబుద్ధిని బయటపెట్టాడు. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహతప్పి...

పెళ్లి పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలతో నమ్మించి.. ఆ వైద్యుడు ఏం చేశాడంటే
Minor girl raped

Updated on: Feb 24, 2022 | 9:43 AM

సమాజంలో మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అతను తన ప్రబుద్ధిని బయటపెట్టాడు. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం(Rape) జరిగినట్లు తేల్చారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ లొకేషన్ ఆదారంగా నిందితుడిని పట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఓ ఆస్పత్రిలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్న రాకేశ్.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఓ యువతికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య సాన్నిహత్యం పెరగడంతో వారు ఓ రోజు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే కలుసుకున్నారు. ఆ రోజు రాత్రి రాకేశ్ తను పనిచేసే ఆస్పత్రికి యువతిని తీసుకొచ్చాడు. ఆమెను తన క్వార్టర్స్‌లో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఊహించని ఈ ఘటనతో బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది. చికిత్స కోసం రాకేశ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతిని పరీక్షించిన వైద్యులు.. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కోలుకున్న తరువాత పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. రాకేశ్ కోసం అతను పనిచేసే ఆస్పత్రికి వెళ్లగా.. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ కేసుపై ముమ్మర విచారణ చేపట్టిన పోలీసులు.. రాకేశ్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నారు.

Also Read

స్నేహం ముసుగులో మోసం.. తక్కువ ధరకే బంగారం ఇస్తానని.. నకిలీ సరకు ముట్టజెప్పి

IND vs SL: మరో రికార్డు సృష్టించనున్న రోహిత్ శర్మ..! ఈ మూడు మ్యాచ్‌లు ఆడితే.. షోయబ్ మాలిక్‌ను దాటేస్తాడు..

Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ