IND vs SL: మరో రికార్డు సృష్టించనున్న రోహిత్ శర్మ..! ఈ మూడు మ్యాచ్‌లు ఆడితే.. షోయబ్ మాలిక్‌ను దాటేస్తాడు..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) మరో ఘనత సాధించనున్నాడు. శ్రీలంక సిరీస్(IND vs SL)తో అత్యధిక..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) మరో ఘనత సాధించనున్నాడు. శ్రీలంక సిరీస్(IND vs SL)తో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందనున్నాడు. ఫిబ్రవరి 24న 3-మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం అవుతుంది. T20I క్రికెట్‌లో అత్యధికంగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ ఆల్-రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)ను రోహిత్ శర్మ ఈ సిరీస్‌తో అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ ఇప్పటికే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడు ఉన్నాడు. అతను శ్రీలంకతో మొత్తం 3 మ్యాచ్‌లు ఆడితే, మాలిక్ 124 మ్యాచ్‌ల సంఖ్యను అధిగమించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు.
కేవలం 9 మంది క్రికెటర్లు మాత్రమే పురుషుల T20Iలలో 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. ఎలైట్ లిస్ట్‌లో ఉన్న ఏకైక భారతీయుడు రోహిత్. అత్యధిక టీ20లు ఆడిన భారతీయుల జాబితాలో ఎంఎస్ ధోని (98) రెండో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 97 మ్యాచ్‌లతో 3వ స్థానంలో ఉన్నాడు. అయితే శ్రీలంకతో లక్నో, ధర్మశాలలో జరగనున్న 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మాజీ కెప్టెన్‌కు విశ్రాంతి ఇచ్చారు.
T20I క్రికెట్‌లో అత్యధికంగా క్యాప్ చేసిన ఆటగాళ్లు
1. షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) – 124
2. రోహిత్ శర్మ (భారత్) – 122
3. మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) – 119
4. ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) – 115
5. మహ్మదుల్లా (బంగ్లాదేశ్) – 113
ఈ మధ్య కాలంలో రోహిత్ గాయం సమస్యలతో సతమతమవుతున్నాడు. అతను దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అయితే వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్, 50 ఓవర్ల ప్రపంచ కప్ వరకు రోహిత్ ఫిట్‌నెస్‌పై సెలక్షన్ కమిటీ నమ్మకంగా ఉంది. “ప్రస్తుతానికి, నాకు ఎటువంటి సమస్యలు లేవు, అన్ని ఆటలు ఆడేందుకు ఎదురుచూస్తున్నాను” అని రోహిత్ బుధవారం చెప్పాడు. ఇదిలా ఉంటే, రోహిత్ మార్టిన్ గప్టిల్‌ను అధిగమించి T20I క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం గప్టిల్ (3299), విరాట్ కోహ్లీ (3296) తర్వాత రోహిత్ 3263 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు.
Read Also.. India vs Sri Lanka 1st T20 Preview: తొలి పోరులో ఎవరు గెలిచేనో.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?