IPL 2022: నేడు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కీలక సమావేశం.. ఖరారు కానున్న మ్యాచ్ ల షెడ్యూల్‌!

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2022 ప్రారంభానికి ముహూర్తం దగ్గపడుతోంది. ఐపీఎల్‌ 15 వ సీజన్‌ మార్చి 27 నుంచి ప్రారంభమై మే 28న ముగియనుందని వార్తలు వినిపిస్తున్నాయి

IPL 2022: నేడు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కీలక సమావేశం.. ఖరారు కానున్న మ్యాచ్ ల షెడ్యూల్‌!
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: Feb 24, 2022 | 6:01 AM

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2022 ప్రారంభానికి ముహూర్తం దగ్గపడుతోంది. ఐపీఎల్‌ 15 వ సీజన్‌ మార్చి 27 నుంచి ప్రారంభమై మే 28న ముగియనుందని వార్తలు వినిపిస్తున్నాయి. టోర్నీలో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని, ముంబై, పుణెలలో అత్యధిక మ్యాచ్‌లు జరుగుతాయని సమాచారం. ఇందుకోసం ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియంతోపాటు బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం, పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలోని మైదానాలను సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌ ప్రారంభం, వేదికల గురించి BCCI నుంచి అధికారిక సమాచారమేమీ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణకు సంబంధించి నేడు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్‌ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదికలు ఖరారు కానున్నాయని తెలుస్తోంది.

కాగా ఇండియాలో పూర్తిస్థాయి ఐపీఎల్‌ జరిగి మూడేళ్లవుతోంది. 2020 ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం దుబాయి వేదికగా జరిగింది. 2021లో లీగ్‌ మళ్లీ ఇండియాకు వచ్చేసింది. అయితే టోర్నీ మధ్యలోనే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మళ్లీ దుబాయికి తరలిపోయింది. ఈక్రమంలో ఈఏడాది ఐపీఎల్ కోసం భారత క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీనికి తోడు ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ అనే రెండు జట్లు కొత్తగా ఐపీఎల్‌ సమరంలో పాల్గొంటున్నాయి. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్ కు మరింత మజా అందనుంది. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం పది ఫ్రాంఛైజీలు తమకిష్టమైన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్నాయి.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నుంచి వేల కోట్లు కట్టించాం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ

Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..