
అయోధ్య రామ మందిర మహా క్రతువు అంగరంగవైభవంగా ముగిసింది. 500 ఏళ్ల కల సాకారమవుతూ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుక కేవలం అయోధ్యకు మాత్రమే పరిమితం కాకుండా యావత్ దేశమంతా కోలాహలంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పండితులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా ఇలా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ వీక్షించేందుకు వీలుగా లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో దేశంలో చాలా చోట్ల భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకొని మరీ ఈ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. ఇదిలా ఉంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఓ సంఘటన అందరినీ ఆకట్టుకుంటుంది.
రామ మందిరంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఉడిపి చెందిన పెజావర్ మఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ.. ముఖంపై ఓ వస్త్రాన్ని కప్పుకొని ఉండడాన్ని గమనించవచ్చు. ఇంతకీ ఆ స్వామి వస్త్రం ఎందుకు కప్పుకున్నారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ఇంతకీ దీనికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హిందూ ఆరాధన ఆచారాల ప్రకారం దేవుడికి నైవేద్యం సమర్పించే సమయంలో ఎవరూ చూడకూదనేది నమ్మకం. ఈ సంప్రదాయాన్ని మాధ్వ శాఖలోని సాధువులు ఎక్కువగా పాటిస్తారు.
Seers of Madhva Sampradaya follow many rituals in the strictest fashion and this was one example. On a Kannada TV channel Swami ji was asked whether it was a South Indian custom. He said no, this is to be followed everywhere. One must close the eyes while offering Naivedya. There… pic.twitter.com/nouxgpShIi
— Sahana Singh (@singhsahana) January 23, 2024
పూరీ జగన్నాథ్ ఆలయంలో భగవంతుడికి ఆహారాన్ని సమర్పించే సమయంలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. మానవ కోరికలతో భగవంతుడికి సమర్పించే నైవేద్యం కలుషితం కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా వస్త్రాన్ని ధరిస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా సాధారణంగా దేవలయాల్లో దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత.. పూజ గది నుంచి బయటకు వస్తుంటారు. అయితే రామ మందిరంలో గర్భగుడిలోనే క్రతువు కొనసాగడంతో స్వామి అలా వస్త్రాన్ని ముఖానికి అడ్డగా పెట్టుకున్నారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..