AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బయటకొచ్చిన షాకింగ్ రిపోర్ట్.. గోల్డ్ నిల్వల్లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..? ఆ దేశాలు గట్టి పోటీ..

బంగారం నిల్వలను పెంచుకునే పనిలో దేశాలన్నీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితులు దిగజారుతున్న క్రమంలో గోల్డ్‌ నిల్వలను పెంచుకోవడంపై దేశాలన్నీ దృష్టి పెట్టాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం, కరెన్సీని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గోల్డ్ నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో ఇండియా స్థానం ఎక్కడంటే..?

Gold: బయటకొచ్చిన షాకింగ్ రిపోర్ట్.. గోల్డ్ నిల్వల్లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..? ఆ దేశాలు గట్టి పోటీ..
Gold
Venkatrao Lella
|

Updated on: Nov 30, 2025 | 11:31 AM

Share

Gold Report: ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఆకాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో గోల్డ్ రేటుకు బ్రేకులు పడటం లేదు. దాదాపు తులం బంగారం లక్షన్నరకు చేరుకోగా.. రానున్న కొద్ది నెలల్లో రూ.2 లక్షలకు కూడా ఎగబాకే అవకాశముందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితుల వల్ల గోల్డ్‌పై పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. గోల్డ్ రేట్ భారీగా పెరగడానికి ఇదొక కారణంగా తెలుస్తోంది. అన్ని దేశాలు కూడా ద్రవ్యోల్బణం, కరెన్సీని రక్షించుకోవడానికి తమ వద్ద గోల్డ్ నిల్వలను పెంచుకుంటున్నాయి. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక దీనిక బలం చేకూర్చుతోంది.

తొలి స్ధానం అమెరికాదే..

ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ నిల్వల్లో అమెరికా తొలి స్థానంలో ఉంది. 2000వ సంవత్సరం నుంచి ఆ దేశంలో గోల్డ్ నిల్వలు స్ధిరంగా ఉన్నాయి. ప్రస్తుతం సగటును 8,134 టన్నులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆ దేశాలు కూడా టాప్‌నే..

ఇక గోల్డ్ నిల్వల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా తర్వాత జర్మనీ దగ్గర ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయి. దాదాపు ఆ దేశం దగ్గర 3,350.25 టన్నుల నిల్వలు ఉన్నాయి. గత త్రైమాసికం కంటే ఈ సారి నిల్వలు కొంచెం తగ్గాయి. ఇక ఇటలీ దగ్గర కొన్ని దశాబ్దాలుగా నిల్వలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2,451.84 టన్నులుగా ఉంది. 2000, 2003, 2025 నుంచి ఇదే సంఖ్య నమోదవుతూ వస్తోంది.ఇక తర్వాతి స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ దగ్గర ప్రస్తుతం 2,437 టన్నుల నిల్వ ఉంది. ఇక రష్యా దగ్గర (2,329.63 టన్నులు), చైనా దగ్గర (2,279.6 టన్నులు), స్విట్జర్లాండ్ దగ్గర (1,040 టన్నులు) నిల్వల ఉన్నాయి.

భారత్ స్థానం ఎక్కడంటే?

ఇక ఇండియా దగ్గర ప్రస్తుతం 800 టన్నుల గోల్డ్ నిల్వ ఉంది. గత త్రైమాసికం కంటే నిల్వలు కాసత్ పెరిగాయి. 2000-2025 వరకు నిల్వలు సగటున 531 టన్నులుగా ఉన్నాయి. 2001లో అత్యల్ప స్థాయిలో నమోదైంది.