Tomato Prices: రాత్రి రాత్రే షాకిచ్చిన టమోటా.. సెంచరీకి చేరువలో కేజీ ధర..! కొనేదెట్ట భయ్యా..
బెంగళూరు ప్రజలకు ఇప్పుడు టమోటా అందన ద్రాక్షల మారిపోయింది. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో టమోటా రేట్లు ఆకాశానంటున్నాయి. సాధారణ సమయాల్లో కిలో రూ.30 నుంచి 40 దొరికే టమోటా ఒకానొక సందర్భంలో సెంచరీకి చేరువలోకి వెళ్లింది. దీంతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పెరిగిన రేట్లతో నగరంలోని చాలా కుటుంబ బడ్జెట్లు అదుపు తప్పాయి.

బెంగళూరు ప్రజలకు ఇప్పుడు టమోటా అందన ద్రాక్షల మారిపోయింది. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశానంటున్నాయి. ఇటీవల రాత్రి రాత్రే టమోట రేట్లు ఊహించని స్థానిక చేరుకున్నారు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరల కారణంగా నగరంలోని చాలా కుటుంబ బడ్జెట్లు అదుపు తప్పాయి. ఈ ధరట పెరుగుదలతో రోజువారి ఖర్చులు పెరిగి జనాలు ఆర్థిక ఇబ్బందులను దుర్కొంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. సాధారణ సమయంలో కేజీ టమోటా ధర రూ.30గా ఉండగా ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ ధర రూ.80కి చేరుకుంది.
ఒక్క టమోటోనే కాదు నగరంలోని మార్కెట్‌లో ఇతర కూరగాయల ధరలు కూడా బగ్గుమంటున్నాయి. మార్కట్‌లోని కూరగాల ధరలు చూసుకుంటే.. కీలో బ్రోకలీ రూ. 170, పచ్చి బఠానీలు రూ. 50, పెన్నీ బీన్స్ ధర రూ. 48. క్యాప్సికమ్ కిలోకు రూ. 80, కొబ్బరికాయలు రూ. 70కి చేరుకున్నాయి. వీటితో పాటు మామిడి రూ. 56, గూస్బెర్రీస్ రూ. 70, అరటిపండ్లు రూ. 32, నిమ్మకాయలు రూ. 58. కాలీఫ్లవర్ రూ. 60, పాలకూ రూ. 20, మెంతి ధర రూ. 22, గుమ్మడికాయలు కిలోకు రూ. 54గా ఉన్నాయి
రేట్లు పెరగడానికి ప్రధాన కారణం
నగరంలో టమోటా ధరలు భారీ పెరగడానికి ప్రధానంగా సరఫరా కొరతే అంటున్నారు వ్యాపారులు, స్థానికులు. సాధారణంగా నగర సమీప ప్రాంతాలైన కోలార్, చిక్కబల్లాపూర్, రామనగర జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుండి వచ్చే టమోటాలపై బెంగళూరు ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే దురదృష్టవశాత్తు, ఆయా ప్రాంతాల్లో అకాల వర్షాలు కారణంగా ఈసారి పంట దిగుబడి తగ్గిపోయింది. అధిక తేమ పంట వ్యాధులకు దారితీసింది, దీనివల్ల రైతులకు గణనీయమైన నష్టాలు సంభవించాయి.దీంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో సప్లయ్ తగ్గి డిమాండ్ పెరగడంతో రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.
ఈ ధరల పెరుగుదల కేవలం ఒక్క బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అండమాన్, నికోబార్ దీవులలో, టమోటా ధర కిలోకు రూ 96 పలుకుతూ సెంచరీకి చేరువలో ఉండగా.. మిజోరాంలో రూ. 92కి ఢిల్లీలో రూ. 80, మణిపూర్‌లో రూ. 78, సిక్కింలో రూ. 71గా కొనసాగుతున్నాయి. అయితే మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే బెంగళూరులో కేజీ టమోటా ధర రూ. 100 సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు. ఇదే భయం ఇప్పుడు బెంగళూరు వాసులను కలవర పెడుతుంది. ఇప్పటికే అధిక రేట్లను తట్టుకోలేకపోతున్న ప్రజలు.. రాబోయే రోజుల్లో ఈ భారీ రేట్ల పెరుగుదలను ఎలా ఎదుర్కొంటారనే విషయం ఇప్పుడు అంతుచిక్కకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




