Third Wave Coronavirus: కరోనా థర్డ్‌వేవ్‌పై ఎలాంటి ఆందోళన చెందవద్దు.. కేంద్ర ఆరోగ్యశాఖ

|

Jul 01, 2021 | 5:33 AM

Third Wave Coronavirus: దేశంలో ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరోవైపు సెకండ్‌వేవ్‌ కరోనా కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ఆంక్షలు..

Third Wave Coronavirus: కరోనా థర్డ్‌వేవ్‌పై ఎలాంటి ఆందోళన చెందవద్దు.. కేంద్ర ఆరోగ్యశాఖ
Third Wave Coronavirus
Follow us on

Third Wave Coronavirus: దేశంలో ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరోవైపు సెకండ్‌వేవ్‌ కరోనా కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల కరోనా పాజిటివ్‌ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరికలు, సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పంచింది. కొద్దిపాటి లక్షణాలతో కరోనా సోకి, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నయమైన పిల్లల ఆర్యోగం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పిన విషయాన్ని కేంద్రం ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఇతర వ్యాధులు ఉన్న పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల విషయంలో మాత్రం జగ్రత్తగా ఉండాలని గులేరియా చెప్పినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. చాలామంది పిల్లల్లో కొవిడ్‌ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చని, అందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాదన్న నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ అభిప్రాయాలను కూడా కేంద్రం ప్రస్తావించింది. కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే రావడం వల్ల జూలై 1 నుంచి 31వరకు లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై స్పందించింది. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటివి ఫేక్‌ వార్తలని తెలిపింది.

కాగా, థర్డ్‌వేవ్‌ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు పాటించకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

ఇవీ కూాడా చదవండి:

Covid 19 vaccine: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం.. ఇప్పటివరకు 33 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా

బ్రెజిల్ తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ లో మా తప్పేమీ లేదు.. భారత్ బయో టెక్ క్లారిటీ