AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Target 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలవడమే టార్గెట్.. పార్టీ క్యాడర్‌కు సీఎం పిలుపు..

డీఎంకే కూటమిలో 40 స్థానాలు గెలువడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గవర్నర్‌లతో పరిపాలన చేయాలనీ జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు..

Target 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలవడమే టార్గెట్.. పార్టీ క్యాడర్‌కు సీఎం పిలుపు..
M K Stalin
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2022 | 9:18 AM

Share

తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే లోక్‌సభ ఎన్నికలపై గురి పెట్టింది. 2024లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయాలని ఆ పార్టీ చీఫ్‌, సీఎం స్టాలిన్‌ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ‘నర్పతుం నమతే, నడుం నమతే’ (40 సీట్లు, దేశం మనదే) లక్ష్యం కావాలని గురువారం విరుదునగర్‌లో జరిగిన డీఎంకే ముప్పెరుం వేడుకలో ఆయన ప్రసంగించారు. డీఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై, ద్రావిడ నాయకుడు ఇవిఆర్ పెరియార్ జన్మదినోత్సవం, డిఎంకె వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ సభలో సీఎం స్టాలిన్ కలైంజర్ పాల్గొన్నారు. డీఎంకే కూటమిలో 40 స్థానాలు గెలువడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గవర్నర్‌లతో పరిపాలన చేయాలనీ జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోతే ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలని నడపలేరని అన్నారు. మన బలం చూపించకపోతే కేంద్రం చెప్పుచేతల్లో మనం బతకాల్సిందేనని.. ప్రభుత్వపాలన లో రాష్ట్ర భవిష్జ్యతు కోసం ఏ ఒక్క సొంత నిర్ణయం తీసుకోలేమన్నారు.

జీఎస్టీ వల్ల ఆర్థిక హక్కును.. నీట్‌తో విద్యాహక్కును హరిస్తోందని విమర్శించారు స్టాలిన్. “కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి విరుద్ధమన్నారు. అన్నా, పెరియార్, కలైంజ్ఞర్, ద్రవిడమ్, తమిళం అంటూ మా సభ్యులు నినాదాలు చేయడంతో పార్లమెంట్ దద్దరిల్లిందని అన్నారు. పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీగా మన ఉనికిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం