Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన మోదీ సర్కార్..

|

Oct 18, 2021 | 8:52 PM

Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది మోడీ సర్కార్. దీపావళి పండగకు బోనస్‌ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ సీలోని

Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన మోదీ సర్కార్..
Diwali Bonus
Follow us on

Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది మోడీ సర్కార్. దీపావళి పండగకు బోనస్‌ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఈ తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను గ్రూప్ ‘సీ’లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం కార్యాలయ మెమోరాండంలో పేర్కొంది. 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులని స్పష్టం చేసింది. కాగా.. మోదీ ప్రభుత్వం దీపావళి  బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Train Ticket: గుడ్‌న్యూస్‌.. ఇకపై రైలులో ఇతరుల టికెట్‌పై ప్రయాణించవచ్చు.. ఎలాగంటే.!

Viral Video: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఇల్లు.. షాకింగ్ వీడియో వైరల్..