Navajot Sidhu: సిద్దుని అదుపులో పెట్టే పనిలో కాంగ్రెస్ హైకమాండ్..
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు తన సలహాదారులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఆయనను హెచ్చరించింది. సిద్దు సలహాదారులైన మల్వీందర్ మాలి, ప్యారేలాల్ గార్గ్ తమ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని, సిద్దుని కూడా ఇరకాటంలో పెట్టారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు తన సలహాదారులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఆయనను హెచ్చరించింది. సిద్దు సలహాదారులైన మల్వీందర్ మాలి, ప్యారేలాల్ గార్గ్ తమ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని, సిద్దుని కూడా ఇరకాటంలో పెట్టారు. వీరిలో ఒకరు పాకిస్థాన్ ను,మరొకరు తాలిబన్లను సమర్థించారు. వీరిని సిద్దు వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో తామే ఈ చర్య తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత, పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ హరీష్ రావత్ పేర్కొన్నారు. ఈ సలహాదారుల కామెంట్లు అనుచితంగా, దురుద్దేశపూరితంగా ఉన్నాయన్నారు. కాశ్మీర్ పై మల్వీందర్ మాలి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని పార్టీ మొదటి నుంచీ చెబుతూ వస్తోందన్నారు. నిజానికి ఈ సలహాదారులను పార్టీ నియమించలేదని, వీరిని డిస్మిస్ చేయాలని తాము సిద్దును కోరుతున్నామని ఆయన చెప్పారు. లేకపోతే తానే ఆ నిర్ణయం తీసుకుంటానన్నారు.
వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో సీఎం అమరీందర్ సింగ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తారా అని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఎప్పుడూ ఒకే పనిని రిపీట్ చేయలేమన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాక లెజిస్లేచర్ పార్టీ సమావేశమై నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటుందని ఆయన చెప్పారు. అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని మార్చాలని నిన్న తనను కలుసుకున్న నలుగురు మంత్రులు కోరలేదని.. స్థానిక సమస్యల గురించి ప్రస్తావించారని ఆయన తెలిపారు. నిజానికి ఆ సలహాదారులను తొలగించాలని అమరీందర్ సింగ్ కూడా మొదటే సిద్దును డిమాండ్ చేశారు. అమరీందర్ నాయకత్వంలో వచ్చే ఏడాది పార్టీ ఎన్నికలకు వెళ్తుందని హరీష్ రావత్ నిన్న ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.
సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.
మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.