చివరి ఎన్నికలన్నానా..? అబ్బే… అలా అనలేదే..! మాట మార్చేసిన కాబోయే ముఖ్యమంత్రి..!

చివరి ఎన్నికలన్నానా..? అబ్బే... అలా అనలేదే..! మాట మార్చేసిన కాబోయే ముఖ్యమంత్రి..!

బీహార్‌ అసెంబ్లీ చివరి దశ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జనతాదళ్‌ యునైటెడ్‌ అధినేత నితీశ్‌ కుమార్‌ భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే కదా!

Balu

| Edited By: Balaraju Goud

Nov 13, 2020 | 1:33 PM

బీహార్‌ అసెంబ్లీ చివరి దశ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జనతాదళ్‌ యునైటెడ్‌ అధినేత నితీశ్‌ కుమార్‌ భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే కదా! ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సంగతి గుర్తుంది కదా! ఇప్పుడు అదే నితీశ్‌కుమార్‌ మాటమార్చేశారు.. అబ్బే తను అలా అనలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు.. ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశం తనకు లేదంటూ కుండబద్దలు కొట్టారు.. అసలు తాను రిటైర్మెంట్‌ గురించే మాట్లాడనేలేదని, అన్నీ బాగానే ముగుస్తాయని మాత్రమే చెప్పానని అన్నారు. తాను ప్రతి ఎన్నికల చివరి ర్యాలీలో ఇదే విషయం చెబుతూ వస్తున్నానని, మరోసారి తన ప్రసంగం వింటే విషయం స్పష్టమవుతందని నితీశ్‌ చెప్పుకొచ్చారు. నిజానికి పూర్నియాలో జరిగిన ర్యాలీలో ఇవే తనకు చివరి ఎన్నికలని ఉద్వేగంగా, స్పష్టంగా చెప్పారు.. ఆ మాటన్న తర్వాత విపక్షాలు విమర్శలు కూడా చేశాయి.. ఓటర్లపై సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించాయి.. ఇప్పుడేమో అసలు తాను ఆ మాటే అనలేదంటున్నారు నితీశ్‌కుమార్‌.. అన్నట్టు వచ్చే సోమవారం రోజున నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu