చైనా ఆక్రమణపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్

గాల్వన్ లోయలో చైనా దళాల పాక్షిక ఉపసంహరణ సానుకూల పరిణామమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఉభయ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే శాంతి, సుస్థిరత ముఖ్యమన్న..

చైనా ఆక్రమణపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్

Edited By:

Updated on: Jul 07, 2020 | 11:13 AM

గాల్వన్ లోయలో చైనా దళాల పాక్షిక ఉపసంహరణ సానుకూల పరిణామమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఉభయ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే శాంతి, సుస్థిరత ముఖ్యమన్న విషయాన్ని చైనా గుర్తించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ప్రధాని మోదీ ఈ దేశ ప్రజలను విశ్వాసం లోకి తీసుకోవాలని కోరిన ఆయన.. మన దేశ భూభాగంలోకి చైనా దళాలు చొరబడలేదని ప్రకటించి తప్పుదారి పట్టించారని, అందువల్ల ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాంగంగ్ సో ప్రాంతం నుంచి చైనా సేనలు వెనక్కి వెళ్లేలా చూడాలని ఆనంద్ శర్మ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రాంతంలో యధాతథ పరిస్థితిని పునరుధ్దరించాల్సిన బాధ్యత చైనాదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా సైతం.. దేశాన్ని తప్పుదారి పట్టించినందుకు ప్రధాని బేషరతుగా అపాలజీ చెప్పాలని కోరారు. చైనా సేనల ఉపసంహరణపై అప్పుడే సంబరాలు పనికిరావని ఆయన అభిప్రాయపడ్డారు.