కన్నుమూసిన అమెరికా అవిభక్త కవలలు

మనషులు వేరైనా దేహాం ఒకటిగా బ్రతికిన అమెరికా అవిభక్త కవలలు కన్నుమూశారు. అమెరికాకు చెందిన జంట రోనీ గ‌ల్యోన్‌, డోనీ గ‌ల్యోన్ త‌మ 68వ ఏట మ‌ర‌ణించారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన క‌న్‌జాయిండ్ ట్విన్స్ గా గుర్తింపు పొందారు.

కన్నుమూసిన అమెరికా అవిభక్త కవలలు
Follow us

|

Updated on: Jul 07, 2020 | 9:56 AM

ఇంతకాలం పెనవేసుకుని జీవించిన ఆ జంట ఇకలేరు. మనషులు వేరైనా దేహాం ఒకటిగా బ్రతికిన అమెరికా అవిభక్త కవలలు కన్నుమూశారు. అమెరికాకు చెందిన జంట రోనీ గ‌ల్యోన్‌, డోనీ గ‌ల్యోన్ త‌మ 68వ ఏట మ‌ర‌ణించారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన క‌న్‌జాయిండ్ ట్విన్స్ గా గుర్తింపు పొందారు.

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని బేవర్‌క్రీక్‌ ప్రాంతం డైటన్‌లో 1951, అక్టోబర్‌ 28న ఈ కవల సోద‌రులు జ‌న్మించారు. ఇద్దరి దేహాలు కలిసి ఉండటంతో ఏం చేసిన కలిసేనడిచేవారు. సోద‌రులిద్దరూ ఏ ప‌నీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్న‌ప్ప‌టికీ చిన్నతనం నుంచే కార్నివాల్స్‌లోనూ, సర్క్‌స్‌లలోనూ ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుటుంబానికి భారం అవుతార‌నుకున్న ఆ సోద‌రులు త‌మ ఆదాయంతోనే కుంటుంబాన్ని పోషించారు. 2010 వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన ఈ జంట ఆ తర్వాత వయసు మీద పడటంతో ఇంటికే పరిమితమయ్యారు.