ప్రియాంకపై పోలీసు జులుం..నా డ్యూటీ నేను చేశానంటున్న మహిళా ఖాకీ..

|

Dec 29, 2019 | 5:10 PM

యూపీ రాజధాని లక్నోలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి 76 ఏళ్ళ దరాపురిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. (సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు వృధ్ధుడని కూడా చూడకుండా… దరాపురిని పోలీసులు అరెస్టు చేశారు). తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఆయన ఇంటికి ప్రియాంక వెళ్తుండగా.. మధ్యలోనే ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకుని ఆమె […]

ప్రియాంకపై పోలీసు జులుం..నా  డ్యూటీ నేను చేశానంటున్న మహిళా ఖాకీ..
Follow us on

యూపీ రాజధాని లక్నోలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి 76 ఏళ్ళ దరాపురిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. (సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు వృధ్ధుడని కూడా చూడకుండా… దరాపురిని పోలీసులు అరెస్టు చేశారు). తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఆయన ఇంటికి ప్రియాంక వెళ్తుండగా.. మధ్యలోనే ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకుని ఆమె ఓ కార్యకర్తకు చెందిన స్కూటర్ పై కొంతదూరం ప్రయాణించారు. కానీ…. దరాపురి ఇల్లు మరో రెండు కి. మీ. దూరంలో ఉండగానే ఖాకీలు మళ్ళీ ఆ వాహనాన్ని బలవంతంగా ఆపివేయించడానికి ప్రయత్నించడంతో.. ప్రియాంక స్కూటర్ దిగి నడిచి వెళ్తున్నప్పుడు సైతం వారు వదలలేదు. అయితే ఆమె వారిని నెట్టివేస్తూ నడక సాగించారు.తనను పోలీసులు మెడ బట్టుకుని లాగారని, చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రియాంక ఆరోపించారు. వారు నన్ను ఘెరావ్ చేయడానికి యత్నించారు.. ఓ మహిళా పోలీసు నన్ను కిందకు నెట్టివేశారు అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను అర్చనా సింగ్ అనే ఆ మహిళా పోలీసు ఖండించారు. తాను ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని, కేవలం తన విధిని మాత్రమే నిర్వర్తించానని ఆమె తన పై అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీఐపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుందని అర్చనా సింగ్.. తన చర్యను సమర్థించుకున్నారు.