ఓరీ దేవుడో..! ఆకాశవీధిలో కొలువైన గణపయ్య.. సోషల్ మీడియలో వీడియో వైరల్‌.. చూస్తే కళ్లు తిరుగుడు ఖాయం!

|

Feb 15, 2023 | 12:00 PM

ఆలయానికి చేరుకోవడానికి రహదారి అందుబాటులో లేనందున అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది.

ఓరీ దేవుడో..! ఆకాశవీధిలో కొలువైన గణపయ్య.. సోషల్ మీడియలో వీడియో వైరల్‌.. చూస్తే కళ్లు తిరుగుడు ఖాయం!
Ganesha
Follow us on

భారతదేశంలో అనేక ప్రసిద్ధ గణపతి దేవాలయాలు ఉన్నప్పటికీ, దట్టమైన అడవిలో ఒక కొండపై ఉన్న ఒక చిన్న గుడికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉన్న 1,000 సంవత్సరాల పురాతన మందిరంలో వినాయకుడికి హారతి ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘aadi_thakur 750’ అనే ఖాతా ద్వారా వినియోగదారు ఈ వీడియోను Instagramలో షేర్‌ చేశారు. లైఫ్‌ గణేశ హారతి అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

ఇకపోతే, ధోల్కల్‌ గణేష్‌ ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం బైలాడిలా పర్వత శ్రేణి దట్టమైన అడవిప్రాంతంగా కనిపిస్తుంది. కొండా చుట్టూ అద్భుతంగా, కన్నుల విందును అందిస్తుంది. అంత ఎత్తైన కొండపై వినాయకుడిని భక్తితో పూజిస్తున్నాడు పూజారి. ధూపదీప నైవేధ్యాలు సమర్పించి భూమి, ఆకాశాలకు సైతం నివేదిస్తున్నాడు. అతడు చేసే పూజలు చుట్టూ ఉన్న బండరాళ్లపై నిలబడి ఉన్న ప్రజలు భయపడుతూనే భక్తితో చూస్తున్నారు. కానీ, ఏ మాత్రం  తడబడిన అక్కడి నుంచి కిందపడితే, కనీసం ఆనవాళ్లు కూడా లభించదనుకుంటా.. అలాంటి ప్రదేశంలో వెలసిన గణపతి ఇప్పుడు ఇంటర్ నెట్ను సైతం షేక్ చేస్తున్నాడు.  ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియోను షేర్ చేసినప్పటి నుండి, ఇది 2.2 మిలియన్లకు పైగా వీక్షణలు, 460k లైక్‌లను సంపాదించింది.

ఇవి కూడా చదవండి

పోస్ట్‌పై నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు వీడియోను ప్రశంసించారు. మరికొందరు స్పందిస్తూ.. సరదాగా చిన్న ఉపరితలంపై నిలబడటానికే తామంతా వణికిపోతుంటామని చెబుతున్నారు. అక్కడ పూజలు చేస్తున్న పూజారి గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు చాలా మంది నెటిజన్లు. ఇలా ఎవరికి వారుగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా వినియోగదారులు.


ధోల్కల్ గణేష్ అని పిలువబడే గణేశ మందిరం అనేక వందల సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది ‘ధోల్’ ఆకారంలో ఉన్న పర్వత శ్రేణిలో ఉంది. ఈ విగ్రహం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో రూపొందించబడిందని నమ్ముతారు. ఆలయానికి చేరుకోవడానికి రహదారి అందుబాటులో లేనందున అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..