హెగ్డే చెప్పిందంతా అబధ్ధం..’ డ్రామా ‘ ప్రసక్తే లేదన్న ఫడ్నవీస్

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. తన సొంత పార్టీకే చెందిన ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ఓ ప్రకటనను ఖండించారు. తమ పార్టీ సహచరుడైన ఫడ్నవీస్ తనకు మెజారిటీ లేకున్నా .. శివసేన నేతృత్వంలోని కూటమి రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపారని, అందువల్లే ఆయనను మహారాష్ట్ర సీఎంగా చేశారని హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే […]

హెగ్డే చెప్పిందంతా అబధ్ధం..' డ్రామా ' ప్రసక్తే లేదన్న ఫడ్నవీస్
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 4:22 PM

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. తన సొంత పార్టీకే చెందిన ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ఓ ప్రకటనను ఖండించారు. తమ పార్టీ సహచరుడైన ఫడ్నవీస్ తనకు మెజారిటీ లేకున్నా .. శివసేన నేతృత్వంలోని కూటమి రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపారని, అందువల్లే ఆయనను మహారాష్ట్ర సీఎంగా చేశారని హెగ్డే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది పూర్తిగా తప్పు అని, తాత్కాలిక ముఖ్యమంత్రిగా అలాంటి నిర్ణయమేదీ తాను తీసుకోలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అసలు ఏ సొమ్మునూ నేను కేంద్రానికి తిప్పి పంపలేదు అని వివరించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విషయంలో మా ప్రభుత్వానికి భూ సేకరణ తప్ప మరెలాంటి పాత్రా లేదని కూడా ఆయన చెప్పారు. కేంద్రం ఎలాంటి నిధులనూ కోరలేదని, పైగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగాన్ని నివారించేందుకు బీజేపీ ‘ డ్రామా ‘ ఆడిందని హెగ్డే చేసిన వ్యాఖ్యలను కూడా ఫడ్నవీస్ సన్నిహిత వర్గాలు రబ్బిష్ అంటూ కొట్టి పారేశాయి. వాట్సాప్ లో సర్క్యులర్ అయిన మెసేజ్ లను చూసి హెగ్డే అలా అని ఉంటారని పేర్కొన్నాయి. ఫడ్నవీస్ సీఎంగా ఉన్న ఆ కొద్ధి సమయంలో రైతులకు ఆర్ధిక సాయం చేసేందుకు నిధులను విడుదల చేయాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నారని ఈ వర్గాలు స్పష్టం చేశాయి.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..