హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడి బీభత్సం.. క్లౌడ్ బరస్ట్ విధ్వంసంతో కూలిపోతున్న భవనాలు.. వివరాలివే..

|

Aug 26, 2023 | 5:25 AM

Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్ పై వరుణుడు పగపట్టినట్లుగా కనిపిస్తోంది.. గంటలు కాదు, రోజులు కాదు.. వారాల తరబడి భారీ వర్షాలతో ఆ రాష్ట్రంపై విశ్వరూపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి ప్రకోపాల ధాటికి కులు సహా పలు ప్రాంతాల్లో భవనాలు ఉన్నపాటికి కుప్పకూలుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడి బీభత్సం.. క్లౌడ్ బరస్ట్ విధ్వంసంతో కూలిపోతున్న భవనాలు.. వివరాలివే..
Himachal Pradesh Floods
Follow us on

Himachal Pradesh Floods: హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడం వంటి ప్రకృతి ప్రకోపాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. 113 చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి.. కుంభ వృష్టి, భారీ వరదలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండడంతో హిమాచల్ ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ సంవత్సరం పడిన భారీ వర్షాల ధాటికి కుల్లు సహా పాలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోతున్న  కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.

అటు మండి జిల్లాలోని దగ్గర క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకు పోయిన 51 మందిని NDRF బృందాలు రక్షించాయి.. భారీ వ‌ర్షాల‌కు విద్యుత్ లైన్లు దెబ్బ తిన‌డంతో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచి పోయింది. కొండ‌ చ‌రియ‌లు విరిగి ప‌డి కులు-మండి హైవే పై వంద‌లాది మంది నిలిచి పోయారు. హైవే పై చిక్కుకున్న వారిని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, నివాస స‌ముదాయాల్లో ఏర్పాటు చేసిన స‌హాయ శిబిరాల‌కు త‌ర‌లించారు.

ఇవి కూడా చదవండి

ప్రకృతి భీభత్సం..

కూలిపోతున్న భవనాలు.. 

భారీ వ‌ర్షాల‌తో భీతిల్లిన హిమాచ‌ల్ ప్రదేశ్‌ను వ‌ర‌ద క‌ష్టాలు వీడ‌టం లేదు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌కు వర్షం ముప్పు ఇంకా పూర్తిగా తొలగి పోలేదు.. ఆగ‌స్ట్ 29 వ‌ర‌కూ రాష్ట్రంలో వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని వాతావరణ శాఖ కూడా పేర్కొన‌డంతో అధికారులు అంతా అప్రమ‌త్తమ‌య్యారు. వ‌ర్షాల నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు, విద్యాసంస్ధల‌కు రాష్ట్ర ప్రభుత్వం సెల‌వు ప్రకటించింది. ఇంకా కొండ‌ చ‌రియ‌లు విరిగి ప‌డే ప్రమాదం ఉండ‌టంతో 729 ర‌హ‌దారుల‌ను మూసివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..