Devagiri Super Fast Express: దేవగిరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య.. నాలుగు గంటలు ఆలస్యం

Devagiri Super Fast Express: దేశంలో ఆలస్యంగా నడిచేవి ఏవంటే ముందుగా గుర్తుకు వచ్చేది రైలు. ఇక రైళ్లలో ఏవైనా సమస్య తలెత్తితే ఇక అంతే. ఆలస్యంగా గమస్థానాలకు ...

Devagiri Super Fast Express: దేవగిరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య.. నాలుగు గంటలు ఆలస్యం

Updated on: Jan 11, 2021 | 9:08 PM

Devagiri Super Fast Express: దేశంలో ఆలస్యంగా నడిచేవి ఏవంటే ముందుగా గుర్తుకు వచ్చేది రైలు. ఇక రైళ్లలో ఏవైనా సమస్య తలెత్తితే ఇక అంతే. ఆలస్యంగా గమస్థానాలకు చేరుకోవాల్సిందే. తాజాగా ముంబై నుంచి సికింద్రాబాద్‌కు నడవాల్సిన దేవగిరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రైలు కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.

కొంత సేపటి క్రితమే కామారెడ్డి నుంచి సికింద్రాబాద్‌కు రైలు బయలుదేరింది. కాగా, సుమారుగా నాలుగు గంటల పాటు ఈ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసు కుదింపు