Indian Railways: నిధుల కేటాయింపుల నుంచి అత్యాధునిక సేవల వరకు.. అభివృద్ధి పథంలో భారతీయ రైల్వే..
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అదిపెద్ద నెట్‌వర్క్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. దీనిలో సుమారు 1.5 మిలియన్ల మంది పని చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో ఉపాధిని అందిస్తోంది. దేశం సుమారు 66 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని మూడు అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది.
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అదిపెద్ద నెట్‌వర్క్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. దీనిలో సుమారు 1.5 మిలియన్ల మంది పని చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో ఉపాధిని అందిస్తోంది. దేశం సుమారు 66 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని మూడు అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది. భారతీయ రైల్వే అనేది సరుకు రవాణా కోసం దేశంలో అతిపెద్ద రవాణా సాధనంగా నిలిచింది. అలాగే దేశంలో 90 శాతం బొగ్గు రవాణా రైల్వేల ద్వారానే జరుగుతుంది. ఇంత సుదీర్ఘ మార్గంలో ప్రతిరోజూ 21 వేలకు పైగా ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. మరోవైపు ప్రయాణికుల గురించి మాట్లాడితే, కరోనాకు ముందు, రోజుకు సుమారు 2.50 కోట్ల మంది రైల్వేలో ప్రయాణించేవారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న రైల్వేలు మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా హైస్పీడ్ వందేభారత్‌తో రైల్వే ప్రయాణం మరింత వేగంగా మారింది. కాగా, రైల్వేల అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వ కూడా ఎన్నో చర్యలు తీసుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గతంతో పోల్చితే రైల్వే అభివృద్ధి సూచికలు ఎలా ఉన్నాయంటే..
1. నిధుల కేటాయింపు, రాబడి: 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు ₹2.40 లక్షల కోట్ల మూలధన వ్యయం అందించారు. 2013-14లో అందించిన వ్యయం కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంది.
2014 నుంచి కొత్త లైన్, గేజ్ మార్పిడి, డబ్లింగ్ ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
2022-23లో ఈ పనుల కోసం సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపు రూ. 67,001 కోట్లకు పెరిగింది. ఇది 2009-14 సగటు వార్షిక బడ్జెట్ వ్యయం కంటే 481% ఎక్కువగా నిలిచింది. (2009-14లో సంవత్సరానికి రూ. 11,527 కోట్లు అందించారు.)
2021-22లో గూడ్స్ రవాణా ద్వారా రైల్వేలు అత్యధికంగా రూ. 1.4 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
2. విద్యుదీకరణ: 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, మొత్తం రైల్వే మార్గాలలో దాదాపు 33% విద్యుదీకరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపు 21,400 కి.మీ మార్గాల్లో రైల్వే విద్యుదీకరణ సాధించారు.
రైల్వేల విద్యుదీకరణలో మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. 2014 నుంచి 2023 వరకు 37,000 కి.మీల మేర రైల్వే విద్యుద్దీకరణ జరిగింది. భారతదేశంలో ఇప్పుడు దాదాపు 90% రైల్వే విద్యుదీకరణ పూర్తయింది.
మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వేలు అపూర్వమైన విద్యుదీకరణను సాధించాయి. అంటే 1948-2014 మధ్యలో 21,413 కి.మీల మార్గం విద్యుదీకరణ పూర్తవ్వగా, అది 2014-15 నుంచి 2022-23 వరకు 37,011 కి.మీల మేర విద్యుదీకరణ పూర్తయింది.
అంతేకాకుండా, రైల్వే విద్యుదీకరణ పరంగా భారతదేశం అభివృద్ధి చెందిన, ప్రముఖ పెద్ద దేశాల కంటే చాలా ముందంజలో నిలిచింది. అమెరికాలో కేవలం 1% కంటే ఎక్కువ రైల్వే మార్గాల విద్యుదీకరణను పూర్తి చేసింది. కెనడా కేవలం 0.2% రైల్వేలను విద్యుద్దీకరించింది. ఇక ఆస్ట్రేలియా, రష్యా, చైనా వంటి దేశాలు వరుసగా 10%, 51%, 68% పూర్తి చేశాయి. యూరోపియన్ యూనియన్‌లో రైల్వేల విద్యుదీకరణ 56%గా నిలిచింది.
ఈ విధంగా భారతదేశం 100% విద్యుదీకరణ లక్ష్యం వైపు పయనించడమే కాకుండా.. జీరో కార్బన్ ఉద్గారాలతో రైల్వేల కోసం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
3. కొత్త లైన్ / గేజ్ మార్పిడి/ డబ్లింగ్ పనులు: కొత్త లైన్‌లో (కొత్త లైన్/డబ్లింగ్/గేజ్ మార్పిడి) 2021-22లో 2,909 కిలోమీటర్లతో పోలిస్తే 2022-23లో 5,243 కి.మీ సాధించారు. ఈ విధంగా సగటు రోజువారీ ట్రాక్ లేయింగ్ రోజుకు 14.4 కి.మీలుగా సాగింది. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నిలవడం గమనార్హం.
2014-22లో, భారతీయ రైల్వేలు మొత్తంగా 20,628 కి.మీలమేర (3,970 కి.మీ.లమేర కొత్త లైన్లు, 5,507 కి.మీ.లమేర గేజ్ మార్పిడి, 11,151 కి.మీ.లమేర డబ్లింగ్) కమీషనింగ్ అయ్యాయి. అంటే సగటున 2,579 కి.మీ/సంవత్సరానికి పూర్తయ్యాయి. ఇది 2009 సమయంలో సగటు కమీషన్ కంటే 70% ఎక్కువగా నిలిచింది.
2009-14లో సగటు రెట్టింపు కమీషనింగ్ సంవత్సరానికి 375 కి.మీ.లు కాగా, ఇది 2014-22లో సంవత్సరానికి 1,394 కి.మీ.కి పెరిగింది.
కొత్త లైన్/డబ్లింగ్/గేజ్ మార్పిడి, 2021-22లో 2,400 కి.మీ లక్ష్యంతో 2,904 కి.మీ సాధించగా, ఇది ఇప్పటివరకు అత్యధికంగా కమీషన్‌గా నిలిచింది.
2014-22లో 1,544 కి.మీలమేర (377 కి.మీ. కొత్త లైన్, 972 కి.మీ. గేజ్ మార్పిడి, 195 కి.మీ. డబ్లింగ్) ఈశాన్య ప్రాంతంలో పూర్తికాగా.. ఇది సంవత్సరానికి సగటున 193 కి.మీ.ల చొప్పున పూర్తయ్యాయి. అయితే, 2009-14లో సాధించిన సగటు వార్షిక కమీషన్ కంటే ఎక్కువ డెవలప్ అయ్యాయి.
4. లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు: భారతీయ రైల్వేలపై లెవెల్ క్రాసింగ్‌లను తొలగించే పని వేగంగా సాగుతోంది. ప్రస్తుతం భారతీయ రైల్వే బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో అన్ని మానవరహిత లెవల్ క్రాసింగ్‌లు తొలగించారు.
2014-22లో మానవ సహిత లెవల్ క్రాసింగ్‌లు సంవత్సారానికి 676 తొలగించగా.. 2009-14 కాలంలో సంవత్సరానికి 199 మాత్రమే తొలగించారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఆగస్ట్-22 చివరి వరకు 216 మనుషుల రహిత లెవెల్ క్రాసింగ్‌లు తొలగించారు.
లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపులో భాగంగా లెవెల్ క్రాసింగ్‌లకు బదులుగా రోడ్డు ఓవర్/అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. 2014-22 కాలంలో 1,225 బ్రిడ్జిలు/అండర్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేశారు. 2009-14లో ఇది 763గా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో, ఆగస్ట్-2022 వరకు 250 రోడ్ల ఓవర్/అండర్ బ్రిడ్జిలు నిర్మించారు.
5. బయో-టాయిలెట్లు: 2014 తర్వాత (మార్చి 2021 వరకు) 73,110 కోచ్‌లలో 2.5 లక్షల బయో టాయిలెట్‌లు ఏర్పాటు చేశారు. ఇవి ట్రాక్‌లపై వ్యర్థాలను విడుదల చేయకుండా సహాయపడుతున్నాయి. 3,647 కోచ్‌లలో 2014 వరకు 9,500 బయో టాయిలెట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ భారత్ మిషన్’కు అనుగుణంగా బయో టాయిలెట్‌లు నిర్మించారు.
6. రైలు ప్రమాదాల తగ్గుదల: భారతీయ రైల్వేలు అనేక కీలక చర్యలను చేపట్టాయి. ఫలితంగా రైలు ప్రమాదాల సంఖ్య 2013-14లో 118 ఉండగా.. 2022-23 సంవత్సరంలో 48కి తగ్గాయి.
7. సరుకు రవాణా: భారతీయ రైల్వేలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా ద్వారా గణనీయమైన లాభాల నమోదుతో చరిత్రలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2021-22లో భారతీయ రైల్వేలు మొదటిసారిగా 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణా మార్కును అధిగమించాయి. భారతీయ రైల్వేలు వరుసగా 25 నెలల ఉత్తమ పనితీరును కలిగి ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..