Bald head: హెయిర్‌లాస్‌తో తీవ్ర మానసిక వేదన.. జీవితాన్ని చాలించిన యువకుడు.. సూసైడ్ నోట్‌లో

|

Nov 10, 2022 | 2:04 PM

బట్టతల వస్తుందనే మనస్తాపంతో కోజికోడ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను సంప్రదించిన డాక్టర్ సరైన చికిత్స అందించలేదని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు.

Bald head: హెయిర్‌లాస్‌తో తీవ్ర మానసిక వేదన.. జీవితాన్ని చాలించిన యువకుడు.. సూసైడ్ నోట్‌లో
Depressed at the thought of going bald, a youth committed suicide
Follow us on

బాల్డ్‌హెడ్‌ బాయ్‌ అని పిలిపించుకోవడం ఎవరికిమాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి. కానీ బట్టతల చెప్పిరాదుగా..మేథోసంపదకది సంకేతం అని సర్దిపుచ్చుకోవడం కూడా కొందరికి చేతకాదు. సరిగ్గా కేరళలోని ఓ యువకుడి మనసుని ముక్కలు చేసింది ఇదే బట్టతల.

హెయిర్‌లాస్‌తో తీవ్ర మానసిక వేదనకు గురైన కేరళ కోజికోడ్‌కి చెందిన ప్రశాంత్‌ ఆత్మహత్య మరోసారి హెయిర్‌ లాస్‌ ట్రీట్‌మెంట్‌ని చర్చనీయాంశంగా మార్చింది. 2014 నుంచి కోజికోడ్‌ లోని స్కిన్‌ స్పెషాలిటీ సెంటర్‌లో ట్రీట్‌మెంట్‌ చేయించుకొని మందులు వాడినా ప్రశాంత్‌కి ఫలితం దక్కలేదు. దీంతో మనోవైదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రశాంత్‌. అయితే తన మరణానికి కారణం తప్పుడు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన ఓ ఆస్పత్రి డాక్టరే అని పేర్కొన్నాడు. దీంతో హెయిర్‌ ఫాల్‌ ట్రీట్‌మెంట్‌ ఎంత వరకు సేఫ్‌.. అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

జుట్టేకదా పోతే పోయిందిలే అని అనుకుంటే ప్రశాంత్‌ ప్రాణాలు పోయేవే కాదు. ఆ మాటకొస్తే ఒక్క ప్రశాంతే కాదు. పెళ్లికి ముందే బట్టతల చాలా మందికి సమస్యగా మారింది. అయితే ఈ సమస్య పరిష్కారానికి లెక్కలేనన్ని క్లినిక్‌లు వెలిశాయి. కుప్పలుతెప్పలుగా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ నిచ్చే క్లినిక్‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే బట్టతలపై జుట్టు కోసం ఏర్పాటు చేసిన క్లినిక్‌లలో సక్సెస్‌ రేట్‌ ఎంత? అనేదే ఇప్పుడు బిగ్‌ క్వశ్చన్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం