భర్త రెండో భార్యను హత్య చేసిన మొదటి భార్య, పిల్లలు.. దోపిడీగా చిత్రీకరణ..!

రెండేళ్ల క్రితం అన్సార్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది మృతురాలు నస్బు. తన భర్త మొదటి భార్య 14,13,6ఏళ్ల వయసు గల ముగ్గురు పిల్లలతో కలిసి నివసించేంది. ఈ క్రమంలోనే జూన్‌ 1న నస్బు దారుణ హత్యకు గురైనట్టుగా వారి పెద్ద కొడుకు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ లోగా ఇంట్లో హత్య జరిగిన విషయం తెలియకుండా ఉండేందుకు.. ఇంట్లోని

భర్త రెండో భార్యను హత్య చేసిన మొదటి భార్య, పిల్లలు.. దోపిడీగా చిత్రీకరణ..!
Crime News

Updated on: Jun 03, 2025 | 10:00 AM

మొదటి భార్య, ఆమె పిల్లలు కలిసి భర్త రెండో భార్యను హత్య చేశారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. సౌదీలో పని చేసే అన్సార్ ఖాన్‌కు అఫస్రీ, నస్బు అనే ఇద్దరు భార్యలున్నారు. అఫస్రీకి 14, 13, ఆరేళ్ల వయస్సున్న ముగ్గురు కుమారులు ఉన్నారు. ఢిల్లీలోని జామియా నగర్‌‌లోని ఒకే ఫ్లాట్‌లో అతడి ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున నస్బు రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. పోలీసు విచారణలో రెండవ భార్య వారి మధ్య విభేదాల కారణంగా ఆ మహిళను చంపినట్లు మొదటి భార్య, పిల్లలు అంగీకరించారని ఒక పోలీసు అధికారి తెలిపారు.

రెండేళ్ల క్రితం అన్సార్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది మృతురాలు నస్బు. తన భర్త మొదటి భార్య 14,13,6ఏళ్ల వయసు గల ముగ్గురు పిల్లలతో కలిసి నివసించేంది. ఈ క్రమంలోనే జూన్‌ 1న నస్బు దారుణ హత్యకు గురైనట్టుగా వారి పెద్ద కొడుకు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు.

ఈ లోగా ఇంట్లో హత్య జరిగిన విషయం తెలియకుండా ఉండేందుకు.. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడవేశారు.. ఇంట్లో దొంగతనం జరిగిందని, దొంగల్ని అడ్డుకోవటంతో నస్బును వారు చంపేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులను నమ్మించలేక పోయారు. దాంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..