AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మణిపూర్‌లో భారీ వరదలు.. 10వేల ఇళ్లకు పైగా ధ్వంసం..ఆ దృశ్యాలు చూస్తే…

సోమవారం కొంగ్బా నది తన కట్టలను దాటిన తర్వాత ఇంఫాల్ తూర్పు జిల్లాలోని బషిఖోంగ్ వద్ద మళ్ళీ కట్ట తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరదల బారిన పడిన జిల్లా ఇంఫాల్ తూర్పు జిల్లాలో బాధితుల కోసం కనీసం 57 సహాయ శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజుల్లో తొంభై మూడు కొండచరియలు విరిగిపడ్డాయి.

మణిపూర్‌లో భారీ వరదలు.. 10వేల ఇళ్లకు పైగా ధ్వంసం..ఆ దృశ్యాలు చూస్తే...
Heavy Floods In Manipur
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2025 | 12:02 PM

Share

మణిపూర్‌లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 56,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. వరదల వల్ల 10,477 ఇళ్లు దెబ్బతిన్నాయని, 56,516,174 మంది బాధితులయ్యారని తెలిపింది. సోమవారం ఇంఫాల్ తూర్పు జిల్లాలో నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి గల్లంతయ్యాడని, 2,913 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి తరలించామని తెలిపింది. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించడానికి 57 రహదారి క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

సోమవారం కొంగ్బా నది తన కట్టలను దాటిన తర్వాత ఇంఫాల్ తూర్పు జిల్లాలోని బషిఖోంగ్ వద్ద మళ్ళీ కట్ట తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరదల బారిన పడిన జిల్లా ఇంఫాల్ తూర్పు జిల్లాలో బాధితుల కోసం కనీసం 57 సహాయ శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజుల్లో తొంభై మూడు కొండచరియలు విరిగిపడ్డాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాలు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖురాయ్, హీంగాంగ్, చెకాన్ ప్రాంతాలలో నది కట్టలను చీల్చుకుని పొంగి ప్రవహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..