న్యూఢిల్లీ, జులై 20: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళా పైలట్, ఆమె భర్తను కొందరు వ్యక్తులు చితకబాదారు. వారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న 10 ఏళ్ల బాలికను పనిలో పెట్టుకోవడమేకాకుండా నిత్యం బాలికను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో బంధువులు బుధవారం దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మైనర్‌పై దాడికి పాల్పడిన కౌశిక్ బాగ్చి (36), అతని భార్య పూర్ణిమ బాగ్చి (33)లను అరెస్టు చేశారు.
బాధితురాలి కుటుంబం అపార్ట్‌మెంట్‌కు దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న జెజె కాలనీలో నివసిస్తున్నారు. రెండు నెలలుగా బాలిక అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. యజమాని పూర్ణిమా నిత్యం బాలికను కొడుతున్న సంగతి బాలిక తల్లిదండ్రులకు తెలియదు. యజమాని బాలికను కొట్టడాన్ని గమనించిన బాధితురాలి బంధువు ఇతర బంధువులు ఇరుగుపొరుగుకు ఈ విషయం చెప్పడంతో వారంతా పూర్ణిమతో వాగ్వాదానికి దిగారు. కోపోధ్రిక్తులైన బాలిక బంధువులు ఫైలట్ యూనిఫాంలో ఉన్న మహిళ జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి మరీ కొట్టారు. ఆమె భర్త కౌశిక్‌ను కూడా చితకబాదారు. క్షమించమని వేడుకున్నా ఆమెను వదలలేదు.
#WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi’s Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her.
The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z
— ANI (@ANI) July 19, 2023
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బాలిక శరీరంపై గాయాలుండటంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తనను అన్ని పనులు చేయమని బలవంతం చేసేదని, కొట్టేదని, వేడి పటకారుతో వాతలు పెట్టేదని బాలిక పోలీసులకు తెల్పింది. వైద్య పరీక్షల్లో కాలిన గాయాలు పాతవేనని, ఇతర గాయాలు తాజావని తేలినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ గాయాలు నిందితులు కాల్చిన గాయాలా లేదా అనేది ఇంకా నిర్ధారణకాలేదని తెలిపారు.
నిందితులైన దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేద పిల్లలపై ఎవరూ ఇలాంటి నేరానికి పాల్పడకుండా వారికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా నిందితురాలు పూర్ణిమ ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పైలట్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త మరో క్యారియర్‌లో ఉద్యోగి. బాధిత బాలిక బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దంపతుల కుమార్తె. ఓ బంధువు ద్వారా ఆ అపార్ట్‌మెంట్లో పనికి కుదిరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.